38.2 C
Hyderabad
April 29, 2024 19: 09 PM
Slider జాతీయం

క్లారిటీ: పౌరసత్వ చట్టం వల్ల ఎవరికీ నష్టం లేదు

kishan reddy

పౌరసత్వ చట్టం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదని కేంద్ర ప్రభుత్వం తరపున తాము స్పష్టం చేస్తున్నా కూడా కొద్ది మంది కావాలని విష ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. లేని అంశాన్ని ప్రచారం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.

CAA లో మైనారిటీ లకు నష్టం చేసే ఏ ఒక్క అంశం కూడా లేదు అని నేను హామీ ఇస్తున్నాను అని ఆయన విస్పష్టంగా చెప్పారు. ఇక్కడి మైనారిటీ ప్రజలను పాకిస్తాన్ పంపిస్తారని దిగజారుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో CAA కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామంటున్న రాజకీయ పార్టీలకు సవాల్ విసురుతున్నా. దేశంలో 130 కోట్ల ప్రజలకు CAA లో వ్యతిరేకంగా ఉన్న అంశాలను చెప్పాలి అని ఆయన సవాల్ చేశారు.

ప్రధాని మోదీ భారత దేశ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నం చేస్తున్నారని, మేకిన్ ఇండియా ద్వారా భారత్ ప్రపంచంలో అగ్రభాగాన ఉండాలని ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ ని విమర్శించడానికి ఏమీ లేదు కాబట్టే CAA పైన దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.

Related posts

చైనా బుద్ధి వంకర: ఎంతకీ మారని నైజం

Satyam NEWS

చేతి వృత్తుల వారిని అవమానపరిచిన సీఎం జగన్

Bhavani

కేసీఆర్ నాయకత్వంలో తిరుగులేని శక్తిగా మారిన టీఆర్ఎస్

Satyam NEWS

Leave a Comment