Slider విజయనగరం

బాధితుల నుంచి 31 ఫిర్యాదుల‌ను స్వీక‌రించిన విజయనగరం ఎస్పీ

#dipikapatilips

స‌త్యం న్యూస్.నెట్ తో  విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక

ప్ర‌తీ వారం మాదిరిగానే ఈ వారం కూడా విజ‌య‌నగ‌రం  జిల్లా ఎస్పీ దీపిక‌…బ్యారెక్స్ లో స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నారు.  ఈ “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ   మొత్తం 31 ఫిర్యాదు లను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు  చెందిన ఒకామె జిల్లా ఎస్పీ కి  ఫిర్యాదు చేస్తూ తనకు భోగాపురం మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగినట్లు, కొంత కాలం తరువాత తన భర్త, అతని కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, అదనపు కట్నం తెమ్మని కన్నవారింటికి పంపించేసారని, వారిపై చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాది పై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరువురుని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశా మహిళా పోలీసు స్టేషన్ సీఐని ఆదేశించారు.

విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తాను కొంత మంది వ్యక్తులు వద్ద డబ్బులు అప్పుగా తీసుకొని నెలవారిగా వడ్డీ చెల్లిస్తున్నట్లు, ఈ మద్య కాలంలో ఆరోగ్యం బాగులేక సకాలంలో వడ్డీ చెల్లించలేక పోవడం వలన కొందరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి, వేదిస్తున్నట్లు, తాను తీసుకొన్న అప్పు తీర్చేందుకు మరికొంత సమయం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదిపై స్పందించిన జిల్లా ఎస్పీ రెస్పాండెంట్స్ ని పిలిపించి, విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం న‌గ‌ర‌ సీఐను అదేశించారు.

కొత్తవలస మండలం, నిమ్మలపాలెంకి చెందిన ఒక వ్యక్తి  జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేసి తన గ్రామం లో ప్రభుత్వం వారు నిర్మించిన సిసి రోడ్డుపై కొంతమంది వ్యక్తులు రాకపోకలకు అంతరాయం కలుగుజేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన యొక్క ట్రాక్టరును వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారని, అడిగితే తనతో గొడవపడుతున్నారని న్యాయం చేయలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ రెస్పాండెంట్స్ ని పిలిపించి, విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస సీఐను ఆదేశించారు.

విజయనగరంకి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తనకు న‌గ‌రంలో కొంత ఖాళీ స్థలం ఉంద‌ని, సదరు స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టనీయకుండా ఇరుగుపొరుగు వారు అడ్డు పడుతున్నారని, వారి పై చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని వ‌న్ టౌన్ సీఐని ఆదేశించారు.

మెరకముడిదాం మండలం, బైరిపురం  కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి తనకు పెదరాయవరం లో కొంత భూమి ఉన్నట్లు సదరు భూమిని కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం చేసి ఆక్రమణకు పాల్పడుతున్నారని, వారిపై చర్య తీసుకొని న్యాయం చేయలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరువురి డాక్యుమెంట్లు పరిశీలించి, విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని బుదరాయవలస ఎస్ఐను అదేశించారు.

విజయనగరం  బ్యాంకు కాలనీకి చెందిన ఒకామె జిల్లా ఎస్పీ కి  ఫిర్యాదు చేస్తూ తనకు న‌గ‌రంలో ఒక ప్లాట్ ఉన్నట్లు, సదరు ప్లాట్ ను వేరొక వ్యక్తికి అద్దెకు ఇచ్చినట్లు, సదరు వ్యక్తి అద్దె చెల్లించడం లేదని, ప్లాటను ఖాళీ చేయమంటే చేయడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదిపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని,ఫిర్యాదికి న్యాయం చేయాలని వ‌న్ టౌన్ సీఐని ఆదేశించారు.

ఇలా  దాదాపు 31  ఫిర్యాదుల‌ను స్వీకరించిన ఎస్పీ… తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ  దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఎస్బీ సీఐలు జి.రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, రుద్రశేఖర్, డీసీఆర్ బి సీఐ డా.బి.వెంకటరావు, ఎస్ఐలు నీలకంఠం, తారకేశ్వరరావు, సూర్యారావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తా

Satyam NEWS

కరోనా కాటుకు బలిఅవుతున్న అడ్వకేట్లకు బార్ సాయం

Satyam NEWS

11వ రోజు ఆహారం అందించిన మై వేములవాడ వాట్సప్ గ్రూప్

Satyam NEWS

Leave a Comment