29.7 C
Hyderabad
April 29, 2024 10: 40 AM
Slider ఆధ్యాత్మికం

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు రద్దు

#bhadrachalam

వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించే తిరువీధి సేవలను రద్దు చేసినట్లు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో ఏడు రోజుల పాటు తిరువీధి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ ప్రకారం నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ కార్యక్రమాలు జరగాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. ఈ మేరకు భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలోనూ, పర్ణశాల దేవస్థానంలోనూ జరిగే అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు కార్యనిర్వహణాధికారి బి.శివాజీ తెలిపారు. అయితే ఈ కార్యక్రమాలను దేవస్థానంలో ఏకాంతంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం లో ముక్కోటి ఉత్సవాల 1వ రోజు మత్స్యావతారం లో భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు.

Related posts

వజ్రోత్సవ వేడుకలకు ఖమ్మం నేతలు

Bhavani

త్వరలో కామన్ మొబిలిటీ కార్డు

Satyam NEWS

తండ్రి ఆత్మహత్యను సెల్ ఫోన్ లో వీడియో తీసిన 4 ఏళ్ల కొడుకు

Bhavani

Leave a Comment