27.7 C
Hyderabad
May 4, 2024 07: 52 AM
Slider విజయనగరం

పెండింగు చలానాలు కట్టించేందుకు పోలీసుల‌  ప్రత్యేక డ్రైవ్

#deepikaips

ఇక నుంచీ ప్ర్ర‌తీ బుధ‌వారం జిల్లాలో స్పెష‌ల్ డ్రైవ్: విజయనగరం  జిల్లా ఎస్పీ ఎం.దీపిక

వాహనదారులపై పెండింగులో ఉన్న ఈ-చలానాలను వసూలు చేసేందుకు ఇక నుంచీ ప్రతీ బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్న‌ట్లు విజ‌యన‌గ‌రం  జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.ఈ మేర‌కు  జిల్లా వ్యాప్తంగా పెండింగు ఈ-చలానాలను వసూలు చేసేందుకు ఈ నెల‌ 27న ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వాహనతనిఖీలు చేపట్టారు.

రాష్ట్రంలో ఎక్కడ వాహన తనిఖీలు చేపట్టినా, వాహనాలపై పెండింగులో గల ఈ-చలానాలను  ఆన్లైనులో పెండింగుగా చూపిస్తాయన్నారు. కావున, వాహనదారులు తమ వాహనాలపై గల పెండింగులోగల  ఈ-చలానాలను తప్పనిసరిగా చెల్లించాలని, లేకుంటే ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవన్నారు.

రహదారి భద్రత,  ప్రమాదాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగులో భాగంగా ప్రతీ రోజూ పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టి, రహదారి భద్రత ప్రమాణాలు, ఎం.వి. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై ఈ-చలానాలు  విధిస్తున్నప్పటికీ, వాటిని చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

వాహనదారుల భద్రత, రక్షణ దృష్ట్యా విధించే ఈ-చలానాలను చెల్లించేందుకుగాను జిల్లాలో ప్రతీ బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టే విధంగా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను జారీ చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు సహృదయంతో అర్ధం చేసుకొని, తమ వాహనాలపై గల పెండింగు ఈ-చలానాలను వెంటనే చెల్లించాలన్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది జూలై 27న వివిధ పోలీసు స్టేషను పరిధిలోగల ముఖ్య కూడళ్ళులో వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాల నంబర్లును ఈ-చలానా యాప్లో చెక్ చేసి, ఆయా వాహనాలపై పెండింగులోగల 710v ఈ-చలానాల నుండి .1,27,510 ల‌ నగదును వివిధ ఆన్లైను విధానాలు ద్వారా జమ చేయించామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

Related posts

వైసీపీ పాలనా వైఫల్యాలపై చర్చకు వస్తావా నానీ?

Satyam NEWS

అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్

Bhavani

ఈ నెల 25 న ఏపీ రాష్ట్ర బంద్…!

Bhavani

Leave a Comment