27.7 C
Hyderabad
April 30, 2024 10: 12 AM
Slider ప్రత్యేకం

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి నీరు విడుదల

#ministerjagadishreddy

నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని మంత్రి జగదీష్ రెడ్డి బుధవారంనాడు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు హాజరయ్యారు. దశాబ్దా కాలం తరువాత జులై లో నాగార్జున సాగర్ ఎడమ కాలవకు నీటిని విడుదల చేశారు.

జులైలో విడుదల చేయడం రెండు దశాబ్దాల రెండు సంవత్సరాలలో ఇది ఇదో సారి. స్వరాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇదే జులై లో విడుదల చేయడం ఇదే ప్రధమం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట,ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగు విస్తీర్ణం ఉంది. నల్లగొండ జిల్లాలో1.45,727 ఎకరాలు,సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు,ఖమ్మం జిల్లాలో(ఎత్తిపోతల తో కలుపుకుని2,41,000 వేల ఎకరాలు సాగవుతుంది.

టి యం సి ల వారిగా నల్లగొండ జిల్లా కు18 టి యం సి లు సూర్యాపేట జిల్లాకు 18 టి యం సి లు ఖమ్మం జిల్లాకు 29 టి యం సి లు కేటాయించారు. కృష్ణా జలాల వాటాలో నిక్కచ్చిగా తెలంగాణా సర్కార్ వ్యవహరిస్తున్నదని మంత్రి తెలిపారు. సాగర్ జలాశయానికి కిందటేడాదితో పోలిస్తే అదనంగా నీరు వచ్చి చేరుతున్నది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కృష్ణమ్మతల్లికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related posts

ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

Bhavani

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే కేసీఆర్ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment