40.2 C
Hyderabad
May 5, 2024 15: 25 PM
Slider సినిమా

స్టార్ వార్స్: ‘గోన గన్నా రెడ్డి’

#NandamuriBalakrishna

కాకతీయ సామ్రాజ్య పోరాట యోధుడు..రాణి రుద్రమ దేవి అనుంగు సహచరుడుగా ప్రసిద్ధి గడించిన గోన గన్నారెడ్డి చారిత్రక వీరగాధను తెరకెక్కించాలని గతంలో  ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అనుష్క నటించిన రుద్రమ దేవి సినిమాలో గోనగన్నా రెడ్డి పాత్రలో తళుక్కుమని మెరిసిన ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ ను పూర్తి నిడివి పాత్రలో నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

భారీ బడ్జెట్ తో కనీవినీ ఎరుగని విధంగా నిర్మించబోయే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను ఇద్దరు బడా నిర్మాతలు తలకెత్తుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఎవరనేది సహజంగానే అందరూ ఈపాటికే అంచనా వేసి ఉంటారు. అయితే బాహుబలి మినహా చారిత్రక జానపద నేపధ్యంలో వస్తున్న చిత్రాలను జనాలు పెద్దగా ఆదరిస్తున్న దాఖలాలు కనపించడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించిన సైరా  సైతం బాక్సాఫీసును బద్దలు కొట్టలేకపోవడంతో నిర్మాతలు నానా తంటాలు పడాల్సివచ్చింది. ఇప్పుడు అల్లు  అర్జున్ చేసేది ఒక సాహసంగానే ఆనిపిస్తోంది. ఇలా ఉండగా నందమూరి నట వంశాకురం ప్రముఖ హీరో బాలకృష్ణ కూడా గోన గన్నారెడ్డి పాత్ర పోషించి తనేమిటో మరోసారి రుజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్నారట! 

కొన్నాళ్ల కిందట గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఒక్కసారిగా విజయోత్సాహం పొందిన బాలయ్య బాబు ఈ సినిమా విషయంలో తన అభిమానుల నుంచి వస్తున్న ప్రపోజల్ ను కాదనలేరని సినిమా విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. గతంలో తెలుగు సినిమా పరిశ్రమ ఇటువంటి పోటాపోటీ సినిమాలను తీసి చేతులు కాల్చుకున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.

గోన గన్నారెడ్డి సినిమా పై మాత్రం హై  ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అల్లు  ఫ్యాన్స్ మాత్రం పోటీ చిత్రం అయితే మాత్రం తట్టుకోవడం కష్టమేనంటున్నారట!

Related posts

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి

Satyam NEWS

నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం

Bhavani

ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుళ్లు .. ముగ్గురు మృతి

Sub Editor

Leave a Comment