29.7 C
Hyderabad
May 1, 2024 03: 04 AM
Slider నల్గొండ

నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం

#Mata Shishu Health Center

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది మాతాశిశు ఆరోగ్య కేంద్రం స్టోర్ రూంలో షాక్ సర్క్యూట్​తో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.స్టోర్ రూమ్​లో చెలరేగిన మంటలు ఇతర వార్డులకు వెంట వెంటనే వ్యాపించాయి. స్టోర్​ రూమ్​లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ మండటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

పొగలు వ్యాపించడంతో వార్డుల్లో ఉన్న రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చిన్నారులతో సహా తల్లులు బయటకు పరుగులు తీశారు.పొగ దట్టంగా అలుముకోవడంతో సిబ్బంది అప్రమత్తమైంది.

వెంటనే పొగ బయటకు పోయేలా కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటుచేసుకుందని తెలిపారు.​మరోవైపు దట్టమైన పొగ వల్ల చిన్నారులు ఊపిరి పీల్చుకునేందుకు కష్టమవుతోందని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు

Related posts

అక్రమంగా ఇసుక తరలిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నట్లు?

Satyam NEWS

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన నారా లోకేష్

Satyam NEWS

విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో అన్నదానం

Satyam NEWS

Leave a Comment