29.7 C
Hyderabad
May 4, 2024 06: 31 AM
Slider ఖమ్మం

వేసవి లో కూరగాయల సాగు అనుకూలం

#vegetable cultivation

వేసవిలో కూరగాయల సాగు అనుకూలమని రైతులు కూరగాయల సాగు చేపట్టాలని జిల్లా ఉద్యానవన అధికారి జినుగు మరియన్న తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కూరగాయలు సాగు చేపట్టిన రాధమ్మ పొలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యానవనాధికారి మాట్లాడుతూ వేసవిలో కూరగాయల సాగు వల్ల

ఎకరానికి యాభై వేలు వరకు ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. రైతులు ప్రస్తుతం కీర, దోస, బుడం, వంగ, ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, తదితర కూరగాయల సాగు చేయుటకు వాతావరణం అనుకూలంగా వున్నదని చెప్పారు. రైతులు పైన పేర్కొనబడిన కూరగాయలు సాగు చేయాలని కోరారు.

రైతులు ఆయిల్ పామ్ సాగులో అంతర పంటలు సాగుకు ప్రభుత్వం ఎకరానికి రూ.4200/- రాయితీ ఇస్తున్నదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

Related posts

వనపర్తిలో వర్తకులకు అందుబాటులో ఉండి సేవ చేస్తా

Satyam NEWS

అరుదైన ఈ జాతి ముత్యాన్ని కాపాడుకుందాం

Satyam NEWS

విజయసాయి యత్నాలపై భగ్గుమంటున్న కాపులు

Satyam NEWS

Leave a Comment