40.2 C
Hyderabad
May 5, 2024 16: 19 PM
Slider ముఖ్యంశాలు

తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య

#CI Ananda Rao

అనంతపురం జిల్లా

తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల లేక కుటుంబ కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రికి చేరుకుని ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సీఐ ఆనందరావు కుటుంబంలో కలహాలు ఉన్నాయని తెలిపారు. రాత్రి గొడవ జరిగిందన్నారు. ఎలాంటి పని ఒత్తిడి లేదని.. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

అయితే ఎస్పీ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా సీఐ ఆనందరావు పెద్ద కూతురు భవ్య వర్షన్ ఉంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేవలం పని ఒత్తిడితోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదన్నారు.

తాడిపత్రిలో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందని హ్యాండిల్ చేయలేకపోతున్నానంటూ తరచూ తన తండ్రి బాధపడ్డారని భవ్య వెల్లడించారు. సీఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి.అని చెప్పారు…

Related posts

ఉత్తరప్రదేశ్ సంఘటను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా నా వారిని కాపాడుకొంటా…

Satyam NEWS

బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందచేత

Satyam NEWS

Leave a Comment