31.7 C
Hyderabad
May 2, 2024 08: 10 AM
Slider ఆధ్యాత్మికం

దేశ వ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

#gurupurnima

నగురో రధకం…నగురోరధికం… నగురోరధికం… శివశాసనతో..శివశాసనతో… శివశాసతో…అంటే గురువే సర్వం…గురువే మూలం…గురువు కన్న మించిన దైవం ఎక్కడ లేదనేది…శాస్త్ర, పురాణాలు చెబుతున్నాయి… మరి గురువులకు గురువు ఎవరంటే ఆది గురువు.. భగవాన్ శ్రీ వేద వ్యాసుడు. ఆ  వేద వ్యాసుడు జన్మించిన తిథి… రోజు ఆషాడ శుథి పౌర్ణమి.దేశ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు… భక్తి పారవశ్యం గా జరిగాయి. అందులో భాగంగా… ఏపీలో ని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞాన ఆశ్రమం… భగవాన్ వేద వ్యాసుని జన్మదిన వేడుకలు భక్తి ,శ్రద్ధలతో జరిగాయి. ఆశ్రమపీఠాధిపతి శ్రీగురూజీ(అంతర్ముఖానంద) ముకుళిత హస్తాలతో ఆశ్రమంలో శ్రీస్వామి రామానందుల వారి సమాధిలో…ఈ వ్యాసపౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సద్గురు గ్రంథాలను శ్రీగురూజీ తో సహా వేడుకలకు హాజరైన శిష్యులందరూ పఠించారు.ఈ వేడుకలకు….ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న శిష్యులు అందరూ హాజరయ్యారు.

శ్రీ గురు పూర్ణిమ శ్లో|| ఏకాక్షరప్రదాతారం, యో గురుం నాభిమన్యతే|

స శ్వయోనిశతం గత్వా, చండాలత్వం అవాప్నుయాత్||

అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. ఓంకారాన్ని ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి వరుసగా నూరుజన్మలు కుక్కగా పుడతాడు. తరువాత కుక్క మాంసాన్ని తినే చండాలునిగా పుడతాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢ శుక్ల ద్వాదశీ వ్రతం.

సత్యవతికి శ్రీమహావిష్ణువు అంశతో వ్యాసమహర్షుల వారు జన్మించారు. ఆయన జన్మించిన తిథి ఆషాఢపూర్ణిమ. వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమగా ప్రసిద్ధికెక్కినది. అనంతరం ఏకరూపం అయిన వేదాన్ని విభజించి,  వేదవ్యాసులయ్యారాయన. అష్టాదశ పురాణాలను, ఉపపురాణాలను, మహాభారత సంహితను, బ్రహ్మసూత్రాలను లోకాలకి అందించిన విష్ణు స్వరూపుడైన వ్యాసుని జన్మమాసం ఈ ఆషాఢమాసం. ఈ పూర్ణిమ నాడు గురుపూజ చేసినవారు దక్షిణామూర్తి స్వరూపులవుతారు.

1. వేదవ్యాసుడు సాక్షాత్తు విఘ్ణస్వరూపుడు. “వ్యాసో నారాయణో హరిః” అని సమస్త జగత్తు ఆయన్ని కీర్తించింది.

2 .శ్రీమన్నారాయణుడు భూమిపై ధరించిన ఇరవై యొక్క అవతారాల్లో ఒక దివ్య అవతారం వ్యాసావతారం.

3. సత్యవతికి, పరాశరుడికి వ్యాసుడు ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఇంచుమించుగా 11:౩౦ కి ఆవిర్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

4. వ్యాస పూర్ణిమని గురుపూర్ణిమ అని పిలవబడడానికి కారణం అందరికి  గురువు ఆయనే. విష్ణువే వ్యాసుడి రూపంలో వచ్చి వేదములను విభజించి యిచ్చిన మహానుభావుడు.

ఆచరించవలసిన విధివిధానములు

1 .మనం ఎక్కడున్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి. గురువుని దర్శించి, సేవ చేసి, ప్రదక్షిణ చేసి దక్షిణ సమర్పించాలి.

2. గురువుకి దూరంగా ఉన్నవారు ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగా గురువుని అర్చించాలి.

3. ఎంత ఎక్కువ గురు స్మరణ చేస్తే, జీవితంలో అంత ఎక్కువ శుభాలను పొందుతారు.

4. అమ్మవారి దగ్గర ఉన్న చింతామణి ఇచ్చేటటువంటి శుభాలు పొందాలంటే గురువు పాదాలు పట్టుకోవాలి.

5. గురువు అనుగ్రహిస్తే యోగాలు కూడా పొందలేనటువంటి శుభాలు ఈ జన్మలో పొందవచ్చు.

6. వ్యాసపూర్ణిమ నాడు తప్పక గురువును పూజించడం వల్ల భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. అందువల్లే స్వగురువుని వ్యాసుడిగా భావించి భక్తితో పూజించాలి

Related posts

జీవో నెం:1ని శాశ్వతంగా రద్దు చేయాలి

Satyam NEWS

కాపు కులస్తుల్లో ఐక్యత ఎంతో అవసరం : బోలిశెట్టి శ్రీనివాసులు

Satyam NEWS

విజయనగరం లో  జర్నలిస్టుల పై దాడి హేయమైన చర్య

Satyam NEWS

Leave a Comment