38.2 C
Hyderabad
April 29, 2024 20: 22 PM
Slider నల్గొండ

ఎస్.బి.ఐ. ఎదుట తెలంగాణ రైతు సంఘం ధర్నా

#sbi

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రంలో ఎస్.బి.ఐ బ్యాంకు ఎదుట తెలంగాణ రైతు సంఘం రైతులు ధర్నా నిర్వహించి అనంతరం బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు,సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కందుల సుందర మల్లేశ్వర్ రెడ్డి, వటైపు సైదులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు,కౌలు రైతులు పంట ఋణాల సాధనకు రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.జులై నెలలో మెట్ట పంటకు,ఆగస్టు నెలలో వరి నాట్లు వేయవలసిన తరుణంలో బ్యాంకర్లు ఋణాలు ఇవ్వకుండా రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల కమిటీ పంట ఋణాలకు వానాకాలం రు.51.230 కోట్లు ప్రకటించారని,అవి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.జూన్ నెల నుండి ఆగస్టు నెల వరకు రైతుల నుండి వసూలు కానీ, జప్తులు చేయవద్దని రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ బ్యాంకర్లు అమలు చేయడంలో వైఫల్యం చెందుతున్నారని అన్నారు.రైతుబంధు నిధులను,ధాన్యం డబ్బులను రైతులకు ఇవ్వకుండా పాత అప్పులు కింద బ్యాంకర్లు జమ చేసుకోవడంపై  తీవ్రంగా ఖండించారు.  కౌలు రైతులకు ఋణమాఫీ వర్తింపు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఋణమాఫీని వెంటనే చెల్లించాలని,కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి గుర్తింపు కార్డులు,ఋణమాఫీ,ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గుండు సైదులు, టి.స్వామి,షేక్ దస్తగిరి,షేక్ ఖాసిం,సైదా, మైసూర్,ఎం నరసింహారావు,దుర్గయ్య,జి నాగేశ్వరరావు,సి.హెచ్.శ్రీనివాసరావు, కోటమ్మ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యంన్యూస్, హుజూర్ నగర్

Related posts

ఇంటి నిర్మాణాలకు ఐదులక్షలు ఇవ్వాలి

Sub Editor 2

కాశ్మీర్ ను ఆఫ్ఘనిస్థాన్‌ లా మార్చిన బీజేపీ నేతలు

Satyam NEWS

అమరుల త్యాగం ప్రజల గుండెల్లో పదిలం

Bhavani

Leave a Comment