33.7 C
Hyderabad
April 29, 2024 23: 31 PM
Slider మహబూబ్ నగర్

మహిళలకు అండగా ఉండేందుకే సఖి కేంద్రం

#sakhi

“సఖి వన్ స్టాప్ కేంద్రం” పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తద్వారా మహిళలకు ఎదురయ్యే అన్ని రకాల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని దేశిఇటిక్యాల 3వ.వార్డు శివారులో నిర్మించిన “సఖి వన్ స్టాప్ కేంద్రం” భవనాన్ని, జిల్లా ఎస్పీ మనోహర్, స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి లతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ సఖి కేంద్రం భవనానికి రూ.48.60 లక్షల రూపాయలతో నిర్మించినట్లు వివరించారు.

ఈ కేంద్రం ద్వారా వివిధ రకాల హింసకు గురైన మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు ఉద్దేశించి సఖి వన్ స్టాప్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు, సఖి కేంద్రంపై గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమె తెలిపారు. ముఖ్యంగా మహిళలపై గృహ హింస, వరకట్నం వేధింపులు, లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి అంశాలకు సంబంధించి బాధితులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, వారికి అండగా నిలిచి, ధైర్యాన్ని నింపి కొత్త జీవితం ప్రారంభించేలా సఖి సెంటర్ సహాయ పడుతుందని సూచించారు.

జిల్లాలో సఖి కేంద్రం మార్చ్, 2019లో ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. సఖి కేంద్రం ద్వారా మహిళలకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్ లైన్ నంబర్ “181” అందుబాటులో ఉంటుందని, గ్రామ, పట్టణ స్థాయి ప్రజలకు సఖి కేంద్రం పై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

గ్రామస్థాయిలో ఎస్సీ, ఎస్ టి, అట్రాసిటీ మహిళలపై జరిగే దాడులపై ప్రత్యేక దృష్టి వహించి, వారికి భరోసా కల్పించే విధంగా “సఖి కేంద్రం” పని చేస్తుందని  అన్నారు. సఖి కేంద్రానికి మార్చి 8వ తేదీ 2019 నుండి ఇప్పటి వరకు 1003 కేసులు అందాయని, ఇందులో 933 కేసులు పరిష్కరించినట్లు ఆమె తెలిపారు.

ఎస్పీ కె మనోహర్ మాట్లాడుతూ సఖి కేంద్రానికి అండగా పోలీస్ శాఖ ఉంటుందని, వారికి 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ…. వివిధ రకాల హింస లపై సఖి కేంద్రం అవగాహన కల్పిస్తుందని సామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖి సెంటర్ సంక్షోభంలో ఉన్న మహిళలు సఖి కేంద్రానికి రావాలని ఎమ్మెల్యే అన్నారు.

48.60 లక్షల రూపాయలతో నిర్మించిన సఖి కేంద్రాన్ని నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. నిర్మాణం ఆశించిన స్థాయిలో లేకపోవడం పట్ల ఇంజనీరింగ్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

50 సంవత్సరాలకు పైబడి గా ఉండాల్సిన భవనాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించలేదని అసహనం వ్యక్తం పరిచారు. కిటికీలు, తలుపులు అదనంగా కావలసిన నిధులను ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఇస్తామన్న కూడా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేష్, మున్సిపల్ చైర్మన్ కల్పన, నాగర్ కర్నూలు జడ్పిటిసి శ్రీశైలం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని వెంకటలక్ష్మి, డిఎస్పి మోహన్ రెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా చైర్మన్ లక్ష్మణ్ రావు, సఖి అడ్మినిస్ట్రేటర్ సునీత, పోలీసు సతీష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీడీపీ జనసేన కూటమికి 128 స్థానాలు

Satyam NEWS

కొవ్వాడ అగ్రహారం లో ఫుడ్ పాయిజన్…!

Satyam NEWS

వర్గ పోరాటాలు తీవ్రతరం చేయాలి

Murali Krishna

Leave a Comment