Slider ఆదిలాబాద్

ఇంకా రోడ్డు సౌకర్యం లేదు…. సిగ్గు సిగ్గు

#indravelli

పాముకాటుతో ఇంద్రవెల్లి ప్రాంతంలో అన్నా చెల్లులు మృతి

పాలకులు ఎన్ని గొప్ప విషయాలు చెబుతున్నా ఆదిలాబాద్ జిల్లా లో ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల పాముకాటుకు గురైన ఇద్దర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లలేని దయనీయ స్థితిలో వారు మరణించారు.

అత్యంత దారుణమైన ఈ సంఘటనలో అత్రం దీపా (3) అత్రం బీంరావ్ (12) మరణించారు. ఇంద్రవెల్లి మండలం పాటగుడా పరిధిలోని మారుతిగూడ  గ్రామానికి చెందిన అత్రం రాజు కవితబాయి కి 7 గురు సంతనం. అర్ద రాత్రి నిద్రస్తున్న సమయంలో  పాముకాటు వేయడంతో ఇద్దరు స్పృహ కోల్పోయారు.

వెంటనే సమాచారం అందించినా కూడా అంబులెన్స్ రావడానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇంద్రవెల్లికి హస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్యం అందక అంతలోనే మృతి చెందారు. తరలించారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు వెడమ బోజ్జు హస్పిటల్ కు వెళ్లి కుటుంబీకులను పరామర్శించి అర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంత కాలం నుండి ఇంద్రవెల్లి మండలం పాటగూడ కు రోడ్డు సౌకర్యం లేదని పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారుల దృష్టి కి తీసుకెళ్లినా పట్టించుకోని పరిస్థితి ఉందని అన్నారు. ఈరోజు రోడ్డు సౌకర్యం ఉంటే ఇద్దరు పిల్లలు బ్రతికే వారని ఆయన అన్నారు.

కోలాం అదివాసి కి చెందిన ఇద్దరు అన్న చెల్లె ఒకే కుటుంబం లో చనిపోవడం చాల బాధాకరమైన విషయం అని ఆయన అన్నారు. ఇప్పటికైనా అదికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు సౌకర్యం కల్పించాలని కుటుంబానికి అర్థిక సాయం అందించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను  కోరారు.

Related posts

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

పూలబాట: పుత్తూరులో రోజా తక్కెళ్లపాడులో సుచరిత

Satyam NEWS

భారీ వర్షాలు వరదలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పెషల్ ఫోకస్

Satyam NEWS

Leave a Comment