37.2 C
Hyderabad
May 6, 2024 21: 21 PM
Slider ప్రత్యేకం

భారీ వర్షాలు వరదలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పెషల్ ఫోకస్

#satyavatirathod

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం  నిర్వహించారు.

భారీ వర్షాలు  కురుస్తున్న నేపథ్యంలో  జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి అని చెరువులు కుంటలు నిండిపో యాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1622 చెరువుల గాను 1400 చెరువులు పూర్తిగా నిండి పోయాయి. 214 చెరువులు మత్తడలు పోస్తున్నాయని మంత్రి తెలిపారు.

జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు,వట్టివాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు వాగులు, వంకలు, నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, షార్ట్ సర్క్యూట్ లు, ప్రమాద స్థాయిలో ఉన్న వైర్ లలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సూచించారు. ప్రజలకు అవసరమయ్యే మందులు, టాబ్లెట్స్, ఇంజెక్షన్ లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ప్రసవ మహిళలు, కిడ్నీ పేషెంట్లను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశాం అని,పునరవాసా కేంద్రంలో ఆహారం ,తాగునీటి  సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఎవరు చేపల వేటకు వెళ్ళ వద్దని, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. చేపలకు వేట కోసం విద్యుత్ వినియోగించే వారిపై కఠిన చర్యలు చేపడతాం మని  హెచ్చరించారు మంత్రి సత్యావతి రాథోడ్.

జిల్లా వాసులకు హెల్ప్ లైన్ సెంటర్ ఎర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశామని ప్రజలు దాన్ని సద్వినియోగించుకొవాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు,పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత,స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్,జడ్పీ ఛైర్పర్సన్ అంగోత్ బిందు,జిల్లా కలెక్టర్ శశాంక,అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, స్థానిక మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి,తహసీల్దార్ నాగ భవాని ఇతర,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు

Murali Krishna

క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

స్టాటిట్యూటరీ వార్నింగ్: ప్రజలారా మంచి వాళ్లనే ఎన్నుకోండి

Satyam NEWS

Leave a Comment