33.2 C
Hyderabad
May 4, 2024 01: 28 AM
Slider ప్రత్యేకం

‘‘జగన్ సర్వీసు’’ అధికారులపై ఈ సీ వేటు

#psranjaneyulu

జగన్ కళ్లలో ఆనందం చూసేందుకు ఒక పిల్లవాడి భవిష్యత్తును నాశనం చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాపై బదిలీ వేటు పడింది. ఇందుకు సహకరించిన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూడా ఈసీ బదిలీ వేటు వేసింది. వీరిద్దరికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ నెల 13వ తేదీన సీఎం జగన్ పై రాయి దాడి ఘటన జరిగింది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. భద్రతా వైఫల్యంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ప్రధాని సభ, ఆ తర్వాత సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించి ప్రాథమిక నివేదికను విజయవాడ సీపీ క్రాంతి రాణా ఈసీకి అందచేశారు.

ఆ తర్వాత ఒక పిల్లవాడిని అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు పెట్టారు. జగన్ కు కొద్ది పాటి గాయమే అయినా కూడా ‘‘ఇది దారుణమైన హత్యాయత్నం’’ అని సీఎం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. ఇలా అరెస్టు చేసిన వేముల సతీష్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడని చెబుతూ ఆ స్టేట్ మెంట్ ప్రకారం వేముల దుర్గారావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దుర్గారావు నుంచి అలాంటి స్టేట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ అభ్యర్ధి బోండం ఉమ ను అరెస్టు చేయాలని విజయవాడ పోలీసులు ప్లాన్ వేశారు. అయితే దుర్గారావు పోలీసులు అడిగిన తరహాలో సమాచారం ఇవ్వలేదు. అతని కాల్ డేటాలో కూడా ఎలాంటి అనుమానాస్పద నెంబర్లు కూడా లేవు. దాంతో విజయవాడ పోలీస్ కమిషన్ నాటకం ముందుకు సాగలేదు. జగన్ పై జరిగిన దాడిలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పోలీసులే కావాలని సానుభూతి కోసం ఈ విధంగా డ్రామా నాటకానికి సహకరించారని కూడా విమర్శలు వచ్చాయి.

ఈ దాడి నిజమైనదేనని నిరూపించేందుకు క్రాంతిరాణా టాటా ఎంతో ప్రయత్నించారు. జగన్ కళ్లలో ఆనందం చూసేందుకు ఒక యువకుడి జీవితాన్ని బలి చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. చివరకు కాంతిరాణా టాటాపైనే వేటు పడింది.

ఈ దాడిలోజగన్ ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. దీంతో సీఎంకు ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ప్రచారం కొనసాగించారు. జగన్‌ నుదుటికు రెండు కుట్లు పడ్డాయని, గాయం పెద్ద తీవ్రమైనది కాదని, ప్రమాదం ఏమీ లేకపోయినా వాపు మాత్రం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. సీఎం భద్రతపై పలువురు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీతో పాటు సీఎం సెక్యూరిటీ, ఎస్కార్ట్‌, పెరిఫెరీ ఇలా వందల మందితో ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతోందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఈ కారణంగానే ఇంటెలిజెన్సు చీఫ్ పై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. జగన్ కు అత్యంత ఆప్తుడు అయిన ఇంటెలిజెన్స్ చీఫ్ పై కూడా వేటు పడటంతో మిగిలిన ఐపిఎస్ అధికారులు ఒక్క సారిగా అవాక్కయ్యారు.

Related posts

వ్యాక్సిన్ తీసుకున్న సినీ హీరో నాగార్జున

Satyam NEWS

ఆకాశంలో ఆవిష్కృతమైన మహాద్భుతం

Satyam NEWS

దళిత సాధికారత కోసమే దళిత బంధు పథకం అమలు

Satyam NEWS

Leave a Comment