30.2 C
Hyderabad
February 9, 2025 19: 07 PM
Slider తెలంగాణ

డ్రైవర్‌ కే కాదు ,వెనుక కూర్చున్న వ్యక్తికీ హెల్మెట్ ఉండాల్సిందే

two wheelar driver pillion driver wear helmet

డ్రైవర్‌ కె కాదు ,వెనుక కూర్చున్న వ్యక్తికీ హెల్మెట్ ఉండాల్సిందేనట ఇక పై ఇలా లేకుంటే ఫైన్ కట్టాల్సిందేనట .ఈ మేరకు ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ లు డ్రైవర్‌ హెల్మెట్ పెట్టుకుని, వెనుక ఉన్నవాళ్లు పెట్టుకోకపోయినా రూల్స్ ప్రకారం ఫైన్ కట్టాల్సి వస్తుందని చెప్పారు ఏసీపీ ఎల్ఎన్ రాజు .ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించాలని ఉప్పల్ ఎక్స్ రోడ్డులో వాహనదారులకు అవగాహన కల్పించారు.

గత సంవత్సరం రాచకొండ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో 750 మంది చనిపోతే.. అందులో 26 మంది బైక్‌పై వెనుక కూర్చున్న వాళ్లే ఉన్నారని ఏసీసీ రాజు తెలిపారు. బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు వెనుక ఉన్నవారు కూడా హెల్మెట్ ధరించకుంటే మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 129/177 ప్రకారం 100 రూపాయల ఫైన్ విధిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో ఉప్పల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కాశీ విశ్వనా థ్, మధుసూదన్, ఎస్సై లు విష్ణు వర్దన్ రెడ్డి,మాణిక్యం, కృష్ణ స్వామి, పుల్లా రెడ్డి, ఏఎస్సైలు శ్రీనివాసరావు, నరేందర్, వీరస్వామి, మోహన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

19న విడుదల అవుతున్న సుమంత్‌ చిత్రం `క‌ప‌ట‌ధారి`

Satyam NEWS

రాసలీలల వైకాపా నేతలు మాధవ్, అంబటి దిష్టి బొమ్మల దహనం

Satyam NEWS

పుల్వామా జవాన్లకు కొల్లాపూర్ లో కొవ్వొత్తులతో నివాళి

Satyam NEWS

Leave a Comment