29.7 C
Hyderabad
May 4, 2024 06: 18 AM
Slider ముఖ్యంశాలు

ఈ సారి నిరాడంబరంగా ఉగాది వేడుక‌లు

#IndrakaranReddy

ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీయం కేసీఆర్ ఆదేశాల మేర‌కు  ఈసారి  కూడా ఉగాది వేడుక‌లను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని, సహకరించాలని కోరారు.

బొగ్గుల‌కుంట‌లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 13న ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని యాదాద్రి శ్రీల‌క్ష్మిన‌ర్సింహా స్వామి దేవాస్థాన ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం  ఉద‌యం 10.45 నిమిషాల‌కు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి  పంచాంగ ప‌ఠ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు.

Related posts

పెద్దమనసు చాటుకున్న పినపాక ఎమ్మెల్యే

Satyam NEWS

సామాజిక బాధ్యత గుర్తుచేసేందుకు 555 కిలోమీటర్ల నడక

Satyam NEWS

ఓటర్ల అవగాహనా పోస్టర్లను ఆవిష్కరించిన సిఇఓ మీనా

Satyam NEWS

Leave a Comment