39.2 C
Hyderabad
May 4, 2024 20: 19 PM
Slider విజయనగరం

నాటి వన్ టౌన్ ఎస్ఐ…నేడు డీఎస్పీ గా బాధ్యతలు…!

విజయనగరం ఆయనకు సుపరిచితమే. మున్సిపల్ కార్పోరేషన్ కాక ముందే…వన్ టౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ గా కొత్త వలస ఎస్ఐ గా పని చేశారు. ఇటీవలే ఏపీ రాష్ట్ర డీజీపీ గా కసి రెడ్డి రాజేంద్ర నాధ్ రెడ్డి… బాధ్యతలు తీసుకున్న అనంతరం… పోలీసు శాఖలో దీర్ఘకాలంగా ఉన్న పోస్ట్ లకు స్థానచలనం కలిగించారు. అందులో భాగంగా రెండు సార్లు రెండు విడతలుగా డీఎస్పీ ల బదిలీ జరిగింది. తొలుత 71 మంది.. రెండో సారి మరికొంత మందికి అందులో వెయిటింగ్ లో ఉన్న 25 మంది డీఎస్పీ లకు పోస్టింగ్ ఇచ్చారు.

ఆ క్రమంలో నే విజయనగరం డిఎస్పీగా ఆర్.గోవిందరావు బాధ్యతలప చేపట్టారు. కోస్టల్ సెక్యూరిటీ విభాగంలో డిఎస్పీ గా పని చేస్తున్న గోవిందరావు ను ఇటీవల విజయనగరం డిఎస్పీ నియమిస్తూ రాష్ట్ర డిజిపి కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గ ఉత్తర్వులు జారీ చేశారు. 1991 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన గోవిందరావు గతంలో ఎస్ఐ, సీఐగా జిల్లాలో భోగాపురం, పూసపాటి రేగ, విజయనగరం రూరల్, వన్ టౌన్, కొత్తవలస లో పని చేశారు.

Related posts

ఏడాది పొడుగునా పివి శత జయంతి వేడుకలు

Satyam NEWS

గన్ కల్చర్:అమెరికాలోమరోసారి కాల్పులు ఇద్దరు మృతి

Satyam NEWS

నంది హనుమంతు వాహనాలపై రాజరాజేశ్వర స్వామి

Satyam NEWS

Leave a Comment