33.7 C
Hyderabad
April 30, 2024 01: 15 AM
Slider నిజామాబాద్

జడ్పీ మీటింగ్.. 5 నిమిషాలు: 2024-25 బడ్జెట్ ఆమోదం

#zpmeeting

15 వ ఆర్థిక సంఘం 2024-25 బడ్జెట్ ప్రణాళిక జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ దఫెదార్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జడ్పీ చైర్మన్ శోభ మాట్లాడుతూ.. 15 ఫైనాన్స్ 2024-25 సంవత్సరానికి 2 కోట్ల 90 లక్షల 4 వేల బడ్జెట్ ను ఆమోదించాలని కోరారు.15వ ఆర్ధిక సంఘం నిధులలో 60 శాతం టైడ్ గ్రాంట్ గా కోటి 74 లక్షల 2 వేలతో పారిశుద్యం, మంచినీటి పనులు 40 శాతం అన్ -టైడ్ గ్రాంట్ క్రింద కోటి 16 లక్షల 2 వేల రూపాయలతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, గ్రంధాలయాలు, శౌచాలయాలు, కిచెన్ షెడ్లు, ఆర్.ఓ. ప్లాంట్లు, సి.సి. రోడ్ల వంటి పనులు చేపట్టుటకు ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. జడ్పీ చైర్మన్ ప్రతిపాదనకు జడ్పీ సభ్యుల తరపున జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్  ఏకగ్రీవంగా  ఆమోదించారని అన్నారు. దాంతో బడ్జెట్ ఆమోదం పొందినట్లయింది.

గంటన్నర ఆలస్యం.. 5 నిమిషాల్లో ముగింపు

బడ్జెట్ కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఉదయం 10:30 గంటలకు ఉందని సమాచారం ఇవ్వగా సరిగ్గా 12 గంటలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే జడ్పీ చైర్మన్ బడ్జెట్ ఆమోదించాలని కోరగా వెనువెంటనే సభ్యులంతా ఏకగ్రీవంగా బడ్జెట్ ఆమోదిస్తున్నట్టు తెలిపారు. దాంతో 5 నిమిషాల వ్యవధిలోనే సమావేశం ముగుస్తున్నట్టు జడ్పీ సీఈఓ సాయగౌడ్ ప్రకటించారు.

రెండవ సారి ఎమ్మెల్యేలు లేకుండానే

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నూతన ప్రభుత్వ హయాంలో రెండవ సారి ఎమ్మెల్యేలు లేకుండానే సాగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించిన జడ్పీ సమావేశం గత డిసెంబర్ 8 న ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కాకముందే జరిగింది. నేటి రెండవ సమావేశం సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నప్పుడు నిర్వహించారు. దాంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రెండవసారి కూడా జడ్పీ సమావేశానికి హాజరు కాలేని పరిస్థితి నెలకొంది.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి కాసుల మాల

Satyam NEWS

రూ.2.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

Satyam NEWS

జ‌న‌వ‌రి 11న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Leave a Comment