26.7 C
Hyderabad
May 3, 2024 10: 17 AM
Slider గుంటూరు

యడవల్లి దళితులకు అన్యాయం చేస్తున్న అధికార పార్టీ

#ydavelli Dalits

గుంటూరు జిల్లా యడవల్లి దళితుల సొసైటీ పునరుద్ధరణ చేయకుండా మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ అడ్డుకుంటే ఉద్యమం తప్పదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.

యడవల్లి, కట్టుబడి వారిపాలెం గ్రామాల్లో 120 దళిత కుటుంబాలను 20 కుటుంబాలకు కుదించి వారి భూములను స్వాధీనం చేసుకుని మైనింగ్ చేసుకునేందుకు మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ప్రయత్నాలతో దళిత రైతులు భయంతో ఉన్నారని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. యడవల్లి గ్రామంలో దళిత వాడ లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో 120 కుటుంబాలు ఉంటే ఇప్పుడు కేవలం 20 కుటుంబాలు ఉన్నట్లు చూపించి సొసైటీ సభ్యులు సంఖ్య తగ్గించాలని ప్రభుత్వం ఆలోచించటం దుర్మార్గపు చర్య అన్నారు. 

ఇప్పుడు వారిలో చనిపోయిన వారి కుటుంబాలకు చెందిన వారసులుగా ఉన్న250 కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, సొసైటీ పునరుద్ధరణ లో వారందరి పేర్లు నమోదు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నవతరం పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.

దళితులకు న్యాయం చేయడానికి ఉద్యమం చెయ్యడానికి వెనుకాడేది లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ వారసుల గుర్తింపు సక్రమంగా జరగలేదు అని గుర్తించి మరలా పూర్తిగా విచారణ జరిపించాలని అన్నీ కుటుంబాల వారసులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

అధికార వైస్సార్సీపీ నేతలు అప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై విమర్శలు చేసి ఇప్పుడు దళితులు పొట్టకొట్టే రాజకీయాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం సిగ్గుచేటు అని అన్నారు.

యడవల్లి,కట్టుబడివారి పాలెం గ్రామాల్లో 120 మంది లబ్దిదారులకు న్యాయం చేయాలని 1975 లో సొసైటీ ఏర్పాటు చేసి 416 ఎకరాలు భూమిని అప్పటి ప్రభుత్వం ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం సొసైటీ రద్దు చేసి దళితులకు అన్యాయం చేసారు అని మరలా ఇప్పుడు వారే సానుభూతిని చూపించటం విడ్డురంగా ఉందని అన్నారు.

అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యంతో సొసైటీ రద్దు అయిందని గొడవ చేసిన వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్,ఎమ్మెల్యే విడుదల రజనీ, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేడు ఎందుకు మాట్లాడటం లేదని రావు సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు.

యడవల్లి సొసైటీ దళిత రైతులు చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న మోసాన్ని రావు సుబ్రహ్మణ్యం కు వివరించారు.

వారికోసం అవసరమైతే ఆమరణ దీక్షకు సిద్ధంగా ఉన్నట్లు, వారి భూములు అంగుళం కూడా ప్రభుత్వం తీసుకోకుండా పోరాడుతానని సుబ్రహ్మణ్యం తెలిపారు.

Related posts

ఎల్ఎండి ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత

Bhavani

ప్రభుత్వ వైఫల్యాలపై నిత్య పోరాటాలు

Satyam NEWS

అనవసరంగా ఎవర్నీ పోలీసు స్టేషన్ లాకప్ లలో ఉంచుకోవద్దు

Bhavani

Leave a Comment