27.7 C
Hyderabad
May 4, 2024 07: 17 AM
Slider విజయనగరం

విశాఖ రేంజ్ డీఐజీ కళ్ల ముందే నిబంధనల ఉల్లంఘన…!

#Vijayanagarampolice

సాక్షాత్తు విశాఖ పోలీసు రేంజ్ డీఐజీ కళ్లముందే విజయనగరంలోని ప్రజలు కరోనా వైరస్ సందర్భంగా అమలు చేస్తున్న నిబంధనలను ఉల్లఘించారు. ఈ మేరకు రేంజ పరిథిలో సిబ్బంది ని కర్ఫ్యూ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాల్సిందేనని ఆయన ఆదేశించారు.

జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని  రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు. రేంజ్ డీఐజీ నగరంలో చింతలవలస, వై జంక్షన్, ఎత్తు బ్రిడ్జి, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, సింహాచలం మేడ, మూడు లాంతర్లు, మున్సిపల్ ఆఫీసు, రాజీవ్ క్రీడా ప్రాంగణం, గంట స్థంభం, కేపి టెంపుల్ ప్రాంతాలో కర్ఫ్యూ అమలు తీరును స్వయంగా పర్యవేక్షించారు.

కర్ఫ్యూ సడలింపు సమయం పూర్తయినప్పటికీ నగరంలో ప్రజలెవ్వరూ కరోనా నిబంధనలను పాఠించడం లేదని సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని, ఇకపై కర్ఫ్యూ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులను విశాఖ రేంజ్ డీఐజీ ఆదేశించారు.

కర్ఫ్యూ అమలును మరో 10 రోజులు యధాతదంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందున, కరోనా నియంత్రణకు, వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.

ప్రజలందరూ వైరస్ తీవ్రతను తెలుసుకుని, విచ్చలవిడిగా, గుంపులుగా సంచరించడం మానుకోవాలన్నారు. మద్యాహ్నం 12 గంటల తరువాత షాపులను పూర్తిగా మూసివేసే విధంగా చూడాలని, ప్రజలు కూడా అకారణంగా తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ రాజకుమారి విశాఖ రేంజ్ డీఐజీ ఆదేశించారు.

ప్రజలకు కరోనా నిబంధనల పట్ల మరింతగా అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండే విధంగా ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాఠించాలన్నారు.

ప్రస్తుతం కరోనా ప్రభావ దృష్ట్యా ప్రతీ ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగాను, డబుల్ మాస్క్ ధరించే విధంగాను, కరోనా నిబంధనలు పాటించే విధంగా చూడాలని పోలీసు అధికారులు, సిబ్బందిని విశాఖ రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు ఆదేశించారు.

విశాఖ రేంజ్ డీఐజీ వెంట జిల్లా ఎస్పీ రాజకుమారి, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, 1వ పట్టణ సీఐ జె.మురళి, ఎస్.ఐ లు బి. దేవి, కిరణ్ కుమార్ నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Related posts

అమరావతి పేరు కూడా వినిపించకుండా పక్కా ప్లాన్

Satyam NEWS

సోము వీర్రాజూ… ఏమిటీ ఈ అపరిపక్వ వ్యాఖ్యలు?

Satyam NEWS

దళితుల భూముల్లో మెగా పార్కు నిర్మించవద్దు

Satyam NEWS

Leave a Comment