38.2 C
Hyderabad
May 5, 2024 19: 15 PM
Slider ముఖ్యంశాలు

రఘురామ లాకప్ హింసపై మానవ హక్కుల కమిషన్ సీరియస్

#RRR

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తనకు జరిగిన లాకప్ హింసపై నేడు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) చైర్మన్ పీసీ పంత్ ను కలిశారు.

ఇటీవల తనను అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన ఆరోపించారు.

సీఐడీ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆయన కుమారుడు కనుమూరి భరత్ ఇప్పటికే ఎన్ హెచ్ఆర్ సీకి ఫిర్యాదు చేశారు.

భరత్ ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ అంతర్గత విచారణకు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, డీజీపీ, సీఐడీకి నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో, ఎన్ హెచ్ఆర్ సీ చైర్మన్ ను స్వయంగా కలిసిన రఘురామ సీఐడీ అధికారుల తీరును వివరించారు.

దీనిపై స్పందించిన చైర్మన్ మొత్తం వ్యవహారంపై విచారణ చేపడతామని చెప్పినట్టు తెలుస్తోంది.

Related posts

బండి సంజయ్ పాదయాత్ర తో ప్రజల్లో వెలిగిన చైతన్య జ్యోతి

Satyam NEWS

ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు కూడా సహకరించాలి

Satyam NEWS

రాయచోటి లో టీడీపీ నేత పై వైసీపీ నేతల దాడి

Satyam NEWS

Leave a Comment