29.7 C
Hyderabad
May 4, 2024 06: 39 AM
Slider ప్రత్యేకం

జర్మనీకి  కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం ఫ్యామిలీ ట్రిప్?

#kollapurmla

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఆయన కనిపించినా సంచలనమే…. కనిపించకపోయినా సంచలనమే. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే  బీరం ఎక్కడ?  Where is MLA అంటూ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నది. ఆయన అభిమానులు ప్రేమతో, వ్యతిరేకులు ద్వేషంతో  ప్రశ్నలు వేస్తున్నారు.

అయితే దానికి ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గ అభివృద్ధి కోసం  వెళ్లారు…. అంటూ సోషల్ మీడియాలో సమాధానం చెపుతున్నారు. మా నాయకుడు ఎక్కడున్నా అభివృద్ధి పైనే దృష్టి అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి దీనిపై సోషల్ మీడియా గ్రూప్ లలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

అభివృద్ధి కోసమేనా విజయవాడ విమానాశ్రయం వెళ్లాడు అంటూ ఆయన వ్యతిరేకులు కౌంటర్ ఇస్తున్నారు. విజయవాడ విమానాశ్రయం ఏమిటి మధ్యలో అని పలువురు పలు సందేహాలు వెలుబుచ్చుతున్నారు. విజయవాడ వెళ్లి అక్కడ నుంచి ‘‘ఎక్కడికో’’ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని మరి కొందరు అడుగుతున్నారు.. ఎమ్మెల్యే విజయవాడ నుంచి ‘‘ఎక్కడికో’’ వెళ్లినట్లు మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఎమ్మెల్యే అనుచరులు కౌంటర్ ఇస్తూ కొద్దిగా భావోద్వేగంగా పోస్టులు పెట్టారు.

ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పి  రాజీనామా చేస్తారా అంటూ ఆయన వ్యతిరేకులు కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్యే అనుచరులే ఎమ్మెల్యే  విజయవాడకు వెళ్లొచ్చు….. ఢిల్లీకి వెళ్లచ్చు అంటూ బదులు ఇచ్చారు. మొత్తానికి ఎమ్మెల్యే  అభివృద్ధి కోసం వెళ్లారని అనుచరులు చెబుతున్నారు. మరికొందరు ఫ్యామిలీ ట్రిప్ అని మరొకరు ఇలా రక రకాలుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  జర్మనీకి ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినట్లు ప్రచారం జరుగుతుంది. అధికారికంగా మాత్రం తెలియదు. ఎందుకోసం వెళ్లారో వారే అధికారికంగా చెప్పేది ఉంది. జూన్ 2వ తేదీన తిరిగి వస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఎమ్మెల్యే ఫ్యామిలీ సంతోషాలతో, మంచి విషయాలతో తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రద్దు

Satyam NEWS

సమంత వెరీ డెడికేటెడ్ & హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్!

Satyam NEWS

మహా శివరాత్రి శుభాకాంక్షలతో సంధ్య స్టూడియోస్ “తొలి ఏకాదశి”

Satyam NEWS

Leave a Comment