40.2 C
Hyderabad
May 5, 2024 15: 45 PM
Slider ముఖ్యంశాలు

తమిళసై ఎందుకు మాటమార్చారో వివరణ ఇవ్వాలి

#Mallu Ravi

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ నిన్నటి వరకూ మాట్లాడిందేమిటి? నేడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించింది ఏమిటి? అనేది రాష్ట్రంలోని సాధారణ ప్రజలు కూడా బేరీజు వేసుకుంటున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు రవి అన్నారు. గవర్నర్ అసెంబ్లీలో చదివిన ప్రసంగం అంతా.. నిన్నటి వరకు ఆమె మాట్లాడిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందని ఆయన అన్నారు. గవర్నర్ ఎందుకు పూర్తిగా యూటర్న్ తీసుకుందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఫామ్ హౌజ్ లు, సెక్రటేరియట్ కట్టడాలే అభివృద్ధి కి సూచికలు కావని  రిపబ్లిక్ డే నాడు చెప్పిన విషయాన్ని మల్లు రవి గుర్తు చేశారు. కానీ ఈ రోజు తెలంగాణ సమగ్ర సమ్మిళత అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అసెంబ్లీలో చెప్పారు. ఈ రెండు ప్రకటనల అంతరాలకు ఎవరు బాధ్యత వహించాలి? నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ లేకుండా మీ పట్ల అనుచితంగా ప్రవర్తించారని మీరే చెప్పుకొచ్చారు ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు మాట మార్చారో తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి కళ్లు తెరిచి చూడండి. కేంద్రం నుంచి వచ్చే పంచాయతీ రాజ్ డబ్బులు అరగంటలో ప్రభుత్వ ఖజానాలో చేరాయి. ఉద్యోగాలు లేవు, కేవలం నోటిఫికేషన్లకే పరిమితమయ్యారు. నిరుద్యోగభృతి ఏమైంది ఒక్కరికి అయినా రూ 3016 ఇచ్చారా? రెండు గదులు ఇల్లు ఊసే లేదు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకోడానికి ఇస్తామన్న 3 లక్షల సాయం ఏమైంది? దళితుల ఆత్మగౌరవం అంటూ వారికి ఇస్తామన్న 3 ఎకరాల భూమి ఏమైంది? ఇప్పుడు దళితబంధు అంటూ కొత్తగా మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

గత బడ్జెట్ లో దళిత బంధు కోసం కేటాయించిన 17 వేల కోట్లు ఎందుకు ఖర్చు చెయ్యలేదని ప్రశ్నించారు. మెడ నరుక్కొని అయినా దళితుడిని సీఎం చేస్తామని ఇచ్చిన మాట ఏమైంది అని డాక్టర్ మల్లు రవి ప్రశ్నించారు. 5 వేల కోట్ల రూపాయల ఫీ రీయింబర్స్మెంట్ బిల్లులు ఎందుకు పెండింగ్ ఉంది. పేదవాడి ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చారు. 4500 సింగిల్ టీచర్ స్కూల్స్ ను రద్దు చేశారు.

మన ఊరు మన బడి అని 2018 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు పరచకుండా , అమలు పరిస్తే ఎలా ఉంటుందో చెప్పే పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. మహిళలు, మైనార్టీల, యువకుల అభివృద్ధిని గాలికొదిలేశారు. సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై చూడటానికి వెళ్తుంటే గాంధీభవన్ దగ్గరే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇది పోలీస్ రాజ్యానికి నిదర్శనం అని రవి అన్నారు. అసలు సచివాలయంలో ఏం జరుగుతోందో తెలియట్లేదు. ఏ రకంగా అగ్ని ప్రమాదం జరిగిందో చెప్పలేదు.

ఏదో తప్పును కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో రూల్ ఆఫ్ లా లేదు. కేసీఆర్ ఇష్టానుసారం పరిపాలన జరుగుతోంది. ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక, రాజ్యాంగ హక్కును కేసీఆర్ కోల్పోయారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ను పాలనా కుర్చీ నుంచి దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని డాక్టర్ మల్లు రవి అన్నారు.

Related posts

కొల్లాపూర్ రాజాగారి కోట నిర్మాణాలపై ప్రభుత్వం స్టేటస్ కో

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగులు, కేసీఆర్ మధ్య పేగు బంధం

Bhavani

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామాలయంలో పుష్పయాగం

Satyam NEWS

Leave a Comment