26.7 C
Hyderabad
May 16, 2024 08: 57 AM
Slider ప్రత్యేకం

యువ శాస్త్రవేత్త అవ్వారు చందన చంద్రయాన్-3 మిషన్లో భాగస్వామి కావడంపై ఆనందం…

#scientist Avaru Chandana

చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా చేర్చి మన దేశం సరికొత్త చరిత్ర లిఖిం చింది. భారత వైజ్ఞానిక సత్తాను ఇస్రో మరోసారి చాటింది. దీని కోసం ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆకుంఠిత దీక్షతో శ్రమించారు.

ఈ క్రతువులో వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరా నికి చెందిన యువ శాస్త్రవేత్త అవ్వారు చందన (26) కూడా భాగ స్వామిగా ఉన్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2019లో నిర్వహించిన ఐఐఎస్టి పోటీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ శాటిలైట్ కేంద్రంలో విక్రమ్ ల్యాండర్ డిజైనర్ విభాగంలో పనిచే స్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ ‘చంద్రయాన్ మిషన్ లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. మూడేళ్లుగా పరిశోధనలు చేస్తున్నా. ప్రతిరోజూ 8 నుంచి 10 గంటల పాటు శ్రమించార ఈ స్ఫూర్తిదాయక విజయం భవిష్యత్తులో చేయనున్న ప్రయోగాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. విక్రమ్ ల్యాండర్ జాబిలి చెంతకు సురక్షితంగా చేరుకోవడంతో మన దేశం ఘనకీర్తిని సొంతం చేసుకొని ప్రపంచంలోనే రికార్డు సృష్టించింది.

మా శ్రమకు ఫలితం దక్కింది. ఇస్రోలో యువ శాస్త్రవేత్తలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రతువులో నాకు భాగస్వామ్యం దక్కడం ఎంతో గర్వంగా ఉంది. ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా తిలకించే అవకాశం రావడం అదృ ష్టంగా భావిస్తున్నా అని వివరించారు. చంద్రయాన్ -3 సంపూర్ణ విజయంతో జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Related posts

విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడ్డ ఫొటో జర్నలిస్టు

Satyam NEWS

వృద్ధులకు దుప్పట్లు పంచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

బిజెపి నేషనల్ కౌన్సిల్ సభ్యునిగా చల్లా వెంకటేశ్వర రావు

Satyam NEWS

Leave a Comment