26.7 C
Hyderabad
May 16, 2024 10: 24 AM
Slider ఖమ్మం

అన్ని పనులు డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలి

#ajay

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంజూరు చేసిన పనులన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అదేశించారు. గోళ్లపాడు ఆధునీకరణ, ఛానల్ పై చేపట్టిన సుందరీకరణ పనులు, పబ్లిక్ టాయిలెట్స్, వైకుంఠ ధామాలు, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ లు తదితర పనులపై మున్సిపల్ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుడా, LRS, MGF ఫండ్స్ ద్వారా కొనసాగుతున్న పాత పనులు, ఇటీవలే శంకుస్థాపన చేసిన కొత్త పనులన్నిటిపై మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ చేయాలని, కొనసాగుతున్న అన్ని పనులపై ప్రతి వారం సమీక్ష చేయాలని మున్సిపల్ కమీషనర్ ను అదేశించారు.

ఖమ్మం నగరానికి ఇప్పటికే అద్భుతంగా సుందరికరించామని, ఇప్పుడు మిగిలి ఉన్న అభివృద్ధి, కొనసాగుతున్న అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. పేదలు, ప్రజల నివాస ప్రాంతాల్లో అవసరమైన చోట VDF రోడ్స్ ను వేసేందుకు పరిశీలించాలన్నారు. రూ.20 లక్షలకు మించకుండా కిలోమీటర్ అంచనాలకు కాకుండా స్క్వేర్ మీటర్ ల ప్రాతిపదికన VDF రోడ్స్ ను వేసేందుకు ఆయా ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఇప్పటికీ ఖమ్మం నగరంలో 9.6 కిలోమీటర్ల రోడ్స్, 40 కిలోమీటర్ల మేర సీసీ డ్రైన్స్ మంజూరు చేసుకున్నామని అన్నారు. మొత్తం 60 డివిజన్లు పరిధిలో 31 డివిజన్ లలో డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశామని, మిగిలిన 29 డివిజన్లలో కూడా వెంటనే శంకుస్థాపనలకు తగు ఏర్పాట్లు  చేయాలని, మొత్తం పనులన్ని పూర్తి స్థాయిలో ముగించాలన్నారు. తక్కువ ఖర్చుతో అయ్యే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

వాల్ ప్రాజెక్ట్స్, డివైడర్స్, హి బీమ్ లైట్స్, గ్రీనరీ తదితర పనులపై దృష్టి సారించాలన్నారు. నగర పరిధిలో దక్కించుకున్న అన్ని పనులన్ని రానున్న డిసెంబర్ 31వ తేదీ లోగా పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి అదేశించారు. ఆయా పనులకు ఇంఛార్జిలుగా ఉన్న DE లు ఆయా పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆయా అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. ఖమ్మం నగర పరిధిలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్స్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించాల్సిందేనని లేని పక్షంలో బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సివస్తుందని హెచ్చరించారు. ఖమ్మంలో నిర్మితమవుతున్న ఆరు పార్కులు, రెండు వైకుంఠ ధామాలు, VDO’s కాలనీ, ఖానాపురం వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ లు కేటీఆర్ గారి చేతుల మీదగా ప్రారంభించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. పెరిగిన డివిజన్లు, పెరిగిన పార్కులు, పారిశుధ్య పరిధి పెరిగిన క్రమేణా సిబ్బందిని పెంచే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Related posts

త్వరలోనే నూతన నాలా నిర్మాణాన్ని చేపడతాం

Satyam NEWS

విజయ బేరి సభకు భారీగా తరలాలి

Bhavani

సమగ్ర శిక్షా క్యాలెండర్ ను విడుదల చేసిన ధర్మాన

Satyam NEWS