39.2 C
Hyderabad
May 4, 2024 21: 00 PM
Slider ఖమ్మం

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు 35 పరీక్షా కేంద్రాలు

#interexams

ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణలో విధులు నిర్వహించే సిబ్బంది విధులు అత్యంత ప్రదానమైనవని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.  ఐడిఓసి కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై పోలీస్, వైద్య, మున్సిపల్, పంచాయతి, విద్యుత్, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్, స్క్వాడ్ అధికారులు, అదనపు చీఫ్ సూపర్ ఇన్డెంట్లు, పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు 35 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  35 కేంద్రాలను 16 జోన్లుగా విభజించి పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ప్రధమ సంవత్సరం విద్యార్థులు 10363 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9504 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిశిత పరిశీలనకు సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి చీఫ్ సూపరింటెండెంట్ రూములో సిసి కెమేరా ఏర్పాటు చేయాలని చెప్పారు. 12  ప్రైవేట్ కళాశాలల  కేంద్రాలకు అదనంగా 12 మంది అదనపు చీఫ్ సూపరిన్టెండెంట్లు విధులు నిర్వహించనున్నట్లు చెప్పారు.  16 పోలీస్ కేంద్రాల్లో పరీక్షా పత్రాలను బద్రపరచనున్నట్లు చెప్పారు. 35 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 35 మంది శాఖాపరమైన అధికారులు విధులు నిర్వహిస్తారని చెప్పారు. మూడు సిట్టింగ్ స్క్వాడ్స్, ఐదు కస్టోడియన్సును నియమిస్తున్నట్లు చెప్పారు. 520 మంది ఇన్విజిలేటర్లుకు విధులు కేటాయించినట్లు చెప్పారు.

పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్సు కేంద్రాలను మూసివేయించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లుపై తయారు చేసిన చెక్ లిస్టు ప్రకారం అన్ని ఏర్పాట్లు  చేయాలని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటుతో పాటు తగినన్ని మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. సి హెచ్ సి ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యసేవలకు వార్డులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పంచాయతీ, మున్సిపల్ అధికారులు పరీక్షా కేంద్రాల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. సురక్షిత చల్లటి మంచినీరు సరఫరా చేయాలని మున్సిపల్, పంచాయతి అధికారులకు సూచించారు.  అంతరాయం లేకుండా నిరంతర నిరంతరం సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులు సకాలలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. సెల్, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు.

Related posts

ఖాళీల భర్తీ… నిరుద్యోగ భృతి కోసం…‘ కోటి సంతకాల సేకరణ’

Satyam NEWS

1xbet официальный Сайт 1xbet Зеркало Казино И Регистрация В Бк

Bhavani

తెలంగాణ అమరులకు సైబరాబాద్ పోలీసులు నివాళి

Bhavani

Leave a Comment