37.2 C
Hyderabad
May 2, 2024 11: 05 AM
Slider రంగారెడ్డి

తెలంగాణ అమరులకు సైబరాబాద్ పోలీసులు నివాళి

#Cyberabad police

అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని ఏసీపీ మట్టయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు., 22.06.2023 రోజున సైబరాబాద్ సీపీ ఆఫీసులోని లాన్ లో తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ సైబరాబాద్ పోలీస్ సిబ్బంది మౌనం పాటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగిందన్నారు.

తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. దశాబ్దాల పోరాటం, ఎందరో ప్రాణాల త్యాగ ఫలితంగా తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసుకోగలిగారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సారథ్యంలో నేడు దేశం లోనే తెలంగాణ పోలీసులు అన్ని విభాగాల్లో ముందున్నారన్నారు.

ముఖ్యంగా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. తెలంగాణ పోలీసులు ప్రజల శాంతిభధ్రతలను కాపాడటానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దేశంలోనే తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్ గా ఉందన్నారు.

నివాళులర్పించిన వారిలో సీఏఓ అకౌంట్స్ చంద్రకళ, ఆర్ ఐ అడ్మిన్ అరుణ్ కుమార్, ఆర్ ఐ హిమకర్, ఆర్ఐ యాదయ్య, మినిస్టీరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాత లిఫ్టుల ఆధునీకరణ, కొత్త లిఫ్టులు మంజూరుకు అభినందనలు

Satyam NEWS

కేంద్ర బ‌డ్జెట్ ను నిర‌సిస్తూ….ఈ నెల 10 న విజ‌య‌వాడ‌లో సద‌స్సు..!

Satyam NEWS

పత్రికా స్వేచ్ఛ హరించిన కల్వకుర్తి ఎస్ఐపై చర్యలు తీసుకోండి

Satyam NEWS

Leave a Comment