38.2 C
Hyderabad
May 2, 2024 21: 33 PM
Slider ప్రత్యేకం

ఖాళీల భర్తీ… నిరుద్యోగ భృతి కోసం…‘ కోటి సంతకాల సేకరణ’

#bandisainjai

కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్

మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా గాంధీకి నివాళులు అర్పించారు… తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన  ‘కోటి సంతకాల సేకరణ’లో భాగంగా తొలి సంతకం చేసారు..బండి సంజయ్ కుమార్.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ మీడియా తో మాట్లాడారు. ఈ కోటి సంతకాల సేకరణ’లో కార్యక్రమంలో  బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రసాద్, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి తదితరులు సంతకాలు చేశారు.

అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేసాడని విమర్శించారు. 2014 అసెంబ్లీలో  కేసీఆర్ 1 లక్షా 7 వేల ఖాళీ భర్తీ చేస్తానని నిరుద్యోగులను దారుణంగా మోసం చేశాడని ఏడున్నరేళ్ల నుండి ఒక్క గ్రూప్-1 లేదు… మూడేళ్ల నుండి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదన్నారు.

ఇప్పటిదాకా ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క లెక్చరర్ పోస్టు లేదు.. యూనివర్శిటీ ప్రొఫెసర్ పోస్టు భర్తీ లేదని నిలదీశారు. బిశ్వాల్ కమిటీ…. 1 లక్షా 92 వేల ఖాళీలున్నయన్నది..కానీ కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోందని విమర్శించారు. అందుకే బీజేవైఎం ఆధ్వర్యంలో ఉద్యోగాల కోసం అనేక పోరాటాలు చేస్తోందని స్పష్టం చేసారు.. బండి సంజయ్ కుమార్.

తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది బీజేపీయేనని దేశ అభివ్రుద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న గొప్ప ప్రధాని మోడీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. ఇదే చివరి ఉద్యమం కావొద్దు…. అందరం కలిసిమరో మహోద్యమ నిర్మిద్దామని

అందులో భాగంగా ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం చేపట్టామన్నారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ‘మిలియన్ మార్చ్’ నిర్వహించి తీరుతామని రాష్ట్ర బీజేపీ ,ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నది ఎవరు? నిరుద్యోగ భ్రుతి హామీ అమలైతే ఈపాటికి నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ లక్షా 8 వేలు అందేవి… ఆ మొత్తం నిరుద్యోగుల అకౌంట్లో వేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మూడేళ్లుగా భర్తీ కోసం యూపీపీఎస్సీ ,ఆర్ఆర్బీ ,బీఎస్ ఆర్బీ ,ఎస్ఎస్సీ ,సీడీఈల ద్వారా ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నయన్నారన్నారు.

మరి తెలంగాణలో నోటిఫికేషన్ ఏది… జాబ్ క్యాలెండర్ ఏది అని టీఎస్పీఎస్సీలోనే 25 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం సాంక్షన్ పోస్టుల్లో 40 శాతం ఖాళీలున్నయని… వాటి సంగతేంటని బండి ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర జనాభాలో 3 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారడం పచ్చి అబద్దమని అన్నారు.జనాభా 3 కోట్ల 72 లక్షలు. ఆ ప్రకారం 11 లక్షల ఉద్యోగాలుండాలని.మొత్తం పోస్టులే 4 లక్షల 91 వేల పోస్టులు… ఏవి? అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. కోటి సంతకాల సేకరణ అందులో భాగంలో… మిలియన్ మార్చ్ ద్వారా సత్తా చూటుదామని ఎంపీ బండి సంజయ్ అన్నారు.

Related posts

పోక్సో వెర్డిక్ట్:హాజిపూర్ సీరియల్ కిల్లర్ కు ఉరిశిక్ష

Satyam NEWS

అభివృద్ధికి అందరు అధికారులు సహకరించాలి

Satyam NEWS

ఉత్సవాలు నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment