ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తన సొంత మరదలిపైనే బావ యాసిడ్ దాడి చేశాడు. దక్షిణ కన్నడ జిల్లాలో మంగుళూరు ప్రాంతంలోని కడబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మరదలు స్వప్న కు ఆమె బావ జయానంద కొట్టరీ కి మధ్య వివాదం చెలరేగడంతో అతను యాసిడ్ దాడి చేశాడు. స్వప్న, జయానంద కొట్టరీ మధ్య ఆర్థిక వివాదం నడుస్తున్నదని పోలీసులు తెలిపారు.
ఒక ఇంటి వివాదంలో వీరిద్దరూ ఘర్షణ పడ్డారని, ఆ వివాదం మనసులో పెట్టుకున్న జయానంద, స్వప్పపై యాసిడ్ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో స్వప్ప ముఖానికి గాయలయ్యాయి. స్వప్పతో పాటు ఆమె మూడెళ్ల కుమార్తె కూడా గాయపడింది. వెంటనే వారిద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్వప్న, ఆమె కూతురు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్వప్ప ఫిర్యాదు మేరకు కడబా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు జయానందను అదుపులోకి తీసుకున్నారు.