33.7 C
Hyderabad
April 30, 2024 02: 37 AM
Slider జాతీయం

కర్నాటకలో భారీగా నగదు ఆభరణాలు స్వాధీనం

#cash

కర్ణాటక పోలీసులు భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ఎత్తున విలువైన వస్తువులు దొరకడం ఇదే ప్రధమం. రైడ్‌లో రూ. 5.60 కోట్ల నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలు మరియు 68 వెండి కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి పోలీసులు కంబళి బజార్‌లోని హేమా జ్యువెలర్స్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించగా ఈ మొత్తం దొరికింది. దీనివిలువ మొత్తం రూ.7.6 కోట్ల నగదు, బంగారం, వెండి గా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల నగల ఆభరణాలు, 68 వెండి కడ్డీలు ఉన్నాయి. హేమ జ్యువెలర్స్ యజమాని నరేష్ సోనీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related posts

తాండూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా

Satyam NEWS

ములుగులో పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పర్యటన

Satyam NEWS

వర్షానికి ఆటో బోల్తా: యువతి మృతి

Satyam NEWS

Leave a Comment