వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం ప్రారంభమైనది. ఈ క్రమంలో ఆదివారం వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. 13వ వార్డు కౌన్సిలర్ పుట్టపాక మహేష్, 20వ వార్డు కౌన్సిలర్ పాకనాటి కృష్ణ, 7వ వార్డు కౌన్సిలర్ నక్క రాములు,26వ వార్డు కౌన్సిలర్ జంపన్న యాదవ్, 23వ వార్డ్ కౌన్సిలర్ భువనేశ్వరి,19వ వార్డు కౌన్సిలర్ చంద్రకళ, 18 వ వార్డు కౌన్సిలర్ సత్యమ్మ, 9వ వార్డ్ కౌన్సిలర్ భాష నాయక్ ను ఎమ్మెల్యే మేఘారెడ్డితో పాటు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచానని తనను వనపర్తి నియోజకవర్గంలోని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చు వనపర్తి ప్రజలు తనను 25వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారని అదే తరహాలో వనపర్తి నియోజకవర్గం నుంచి 50వేల మెజారిటీ ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చందర్, కౌన్సిలర్లు వెంకటేష్, విభూది నారాయణ, సత్యం సాగర్, జయసుధ మధు, లక్ష్మీ రవి యాదవ్, సుమిత్ర యాదగిరి, బ్రహ్మం చారి, నాయకులు లక్కాకుల సతీష్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్