29.7 C
Hyderabad
May 4, 2024 06: 38 AM
Slider ముఖ్యంశాలు

రూ.2 కోట్లతో నిమ్స్ లో అధునాతన పరికరాలు

#Harish Rao

నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు రూ. 2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్‌ ఆల్ట్రా సౌండ్‌, ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరో మానిటరింగ్, ఆల్ట్రా సోనిక్‌ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ట్రామా బ్లాక్ (EMD)లోని మూడో ఫ్లోర్ లో రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మారుతున్న సాంకేతికత అందిపుచ్చుకునేలా వస్క్యులర్ సర్జరీ సింపోసియం నిర్వహించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వైద్యులు నిత్య విద్యార్థులు. రోజు ఎంతో సాంకేతికత పెరుగుతున్నది. గత ఏడాది కరోనా వచ్చిన సమయంలో ఎక్విప్మెంట్ కోసం 150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

ఐసియూ పడకలు డబుల్ చేసుకున్నాము అని ఆయన తెలిపారు. డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలంగాణ మోడల్ అడాప్ట్ చేస్తున్నాం అన్నారని మంత్రి హరీష్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 డయాలిసిస్ కేంద్రాలు ఉండేవని ఇప్పుడు వాటిని 102 కి పెంచుతున్నామని మంత్రి తెలిపారు. డయాలిసిస్ మీద తెలంగాణ ప్రభుత్వ ఏటా వంద కోట్లు ఖర్చు చేస్తున్నదని, డయాలసిస్ వారికి బస్ పాస్, పింఛన్లు, జీవిత కాల మందులు ఉచితంగా అందిస్తున్నాం.

డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండ ఇస్తున్నది. తెలంగాణలో 50 లక్షల డయాలసిస్ సైకిళ్ళు పూర్తి చేశాం అని ఆయన తెలిపారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అత్యధికంగా నిమ్స్ లో జరుగుతున్నాయి. జీవన్ దాన్ అవయవ దానం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంది. అందరం కలిసి అవయవదానం ప్రోత్సహించాలి అని మంత్రి పిలుపునిచ్చారు.

Related posts

మంత్రి ధర్మానను కలిసిన న్యాయవాది శ్రీకాంత్

Satyam NEWS

చోళ రాజ దండానికి మూలం నోలంబ రాజ చిహ్నం

Bhavani

జంట హత్యలు..బీహార్ గ్యాంగ్ ఘాతకం

Bhavani

Leave a Comment