27.7 C
Hyderabad
May 7, 2024 08: 05 AM
Slider విజయనగరం

విద్యల నగరంలో విద్యార్ధులతో మాటకలిపిన మంత్రి బొత్స

#ministerbotsa

హైదరాబాద్ లో జేఎన్టీయూ కి ధీటుగా ఏపీలో ని విజయనగరం లో జేఎన్టీయూ ని నెలకొల్పిన ప్రభుత్వం… గురజాడ అప్పారావు పేరుతో.. జేఎన్టీయూ ని నడుపుతోంది. ఈ నేపథ్యంలో రూ. 19 కోట్ల తో అభివృద్ధి పనులకు మంత్రి బొత్స శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స మాట్లాడారు. గురజాడ జేఎన్టీయూ లో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కు..యూనివర్సిటీ స్డూడెంట్స్ సమస్యలను విన్నవించారు. అంతకు ముందు గురజాడ జేఎన్టీయూ లో 19 లక్షల తో కొత్త భవన నిర్మాణాలకు, విజయనగరం గాజులరేగ లో ఉన్న గురజాడ జేఎన్టీయూ లో మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడే ముందు యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ఇంట్రాక్ట్ అయ్యారు. యూనివర్సిటీ లో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని స్టేజ్ మీదకు వచ్చి నిర్భయంగా సంకోచించకుండా చెప్పిలని మంత్రి బొత్స కోరారు. దీంతో ఇద్దరు ఆడిపిల్లలు, ఇద్దరు మగపిల్లలు స్టేజ్ పైకి వచ్చి, ఫ్యాకల్టీ బాగుందని కానీ రవాణా సౌకర్యం అదనపు స్టడీ అవర్ కోసం ప్రత్యేక ఫ్యాకల్టీ అలాగే అదనంగా కంప్యూటర్ క్లాస్ లతో పాటు ఏసీ ఆడిటోరియం అవసరమని స్టూడెంట్స్ చెప్పారు. సావధానంగా ఆలకించిన మంత్రి బొత్స అక్కడికక్కడే వీసీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ను నోట్ చేసుకోవాలని సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయిస్తానని మంత్రి బొత్స సత్యనారాయణ సభా ముఖంగా చెప్పడం విశేషం.

Related posts

కరోనా వ్యాప్తిపై అవగాహనతో ప్రజలు మెలగాలి

Satyam NEWS

6జి టెక్నాలజీ కోసం సన్నాహాలు ప్రారంభించిన భారత్

Sub Editor

కొత్త కొలువులు వెతుక్కున్న పాతకాపులు

Satyam NEWS

Leave a Comment