39.2 C
Hyderabad
May 4, 2024 21: 08 PM
Slider గుంటూరు

గుంటూరు తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు సాయం

#Nakka Ananda Babu

గుంటూరులో జనవరి 1 వ తేదీన ఉయ్యురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జనతా వస్త్రాల పంపిణి లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులను అందచేశారు.

తొక్కిసలాటలో మృతి చెందిన షేక్ బీబీ,గోపిదేశీ రమాదేవి,సయ్యద్ ఆసియా కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరపున 5లక్షల పరిహారపు చెక్కులను అందించే కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర, డేగల ప్రభాకర్, చిట్టాబత్తిన చిట్టిబాబు లు కూడా పాల్గొన్నారు. శుక్రవారం నాడు బాధితుల నివాసాల వద్దకు వెళ్ళి కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

చంద్రబాబు ప్రకటించిన 5లక్షల రూపాయల చెక్కు అలాగే పార్టీలోని మిగతా నాయకులు ప్రకటించిన ఆర్థిక సహయాన్ని కూడా కలిపి10లక్షలు అందించారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనను వైసీపీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. సభకు అన్నిరకాల అనుమతులు తీసుకున్నా అనేకరకలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, చివరకు పోలీసులను కూడా లేకుండా చేసిన ప్రభుత్వ వైఫల్యం గానే తొక్కిసలాట జరిగింది అని ఆయన అన్నారు.

కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలకు పూర్తిగా ప్రభుత్వo, పోలీసుల వైఫల్యమేనని ఆయన అన్నారు. పేదలకోసం చేసే సేవా కార్యక్రమలు చూసి ఓర్చుకోలేని ప్రభుత్వం ఈవిధంగా వక్రమార్గాలు చేస్తుంటే కోర్టులు ద్వారా న్యాయం పొంది బయటకు రావాల్సివస్తుంది.

ప్రభుత్వం చంద్రబాబు సభలకు కావాల్సిన పోలీసులు బలగాలను ఇవ్వకుండా ప్రజల మరణాలకు కారకులయ్యారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రజలలోకి వెళ్లకోడదనే ఉధ్యేశ్యంతోనే జీవో నెం1 తెచ్చారు అని ఆయన అన్నారు.

Related posts

విద్యాసంస్థల్లో బియ్యం సరిగా ఉంచకపోతే అధికారులపై కఠిన చర్యలు

Satyam NEWS

సుప్రియ పై వివాదాస్పద వ్యాఖ్యలు: భగ్గుమన్న మహారాష్ట్ర

Bhavani

ఎటూ తేలని చంద్రబాబు కేసు: త్రిసభ్య ధర్మాసనానికి నివేదన

Satyam NEWS

Leave a Comment