31.2 C
Hyderabad
May 11, 2024 23: 59 PM
Slider ముఖ్యంశాలు

ఎటూ తేలని చంద్రబాబు కేసు: త్రిసభ్య ధర్మాసనానికి నివేదన

#TDP

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ వేర్వేరుగా తీర్పులను వెల్లడించారు. ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని సీజేకి బెంచ్ విజ్ఞప్తి చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయనను జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టు అక్రమమని పేర్కొంటూ తనపై కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు అక్రమమని తనకు 17 ఏ వర్తిస్తుందని, ఈ సెక్షన్ ప్రకారం తనను అరెస్టు చేయడానికి ముందుగానే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Related posts

మరణించిన హోంగార్డు కుటుంబసభ్యులకు చేయూత

Satyam NEWS

ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

Bhavani

విదేశాల నుంచి వచ్చిన వారు ఐసోలేషన్ లో ఉండాలి

Satyam NEWS

Leave a Comment