Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో మీడియాపై దారుణమైన ఆంక్షలు

YS Jagan Review Meeting_2_0

నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా సామాజిక మాధ్యమాల్లో  ఉంచినా సదరు వ్యక్తులు లేదా సంస్థల పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. పరువు నష్టం కలిగించేలా నిరాధారమైన, దురుద్దేశపూర్వకంగా వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు కూడా ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పించారు. ప్రజలకు సరైన సమాచారం వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులు వెలువరించినట్టు సమాచార పౌరసంబంధాల శాఖ స్పష్టం చేసింది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్య మూల స్తంభాలలో మీడియా ఒకటి. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను, విధానాలను ప్రశ్నించే కలాలను, గొంతులను కట్టడి చేస్తున్న ఈ చర్యను ఖండిస్తున్నాం. ఈ ఉత్తర్వును తక్షణం రద్దు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

దక్షిణ కోస్తా,రాయలసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి:సిఎస్

Bhavani

ప్రైవేట్‌ స్కూళ్ళను రద్దు చేయటమే పరిష్కారం!

Satyam NEWS

ఆన్‌లైన్‌ తరగతులతో సరికొత్త చరిత్రకు నారాయణ శ్రీకారం

Satyam NEWS

Leave a Comment