20.7 C
Hyderabad
December 10, 2024 02: 22 AM
Slider తెలంగాణ

తాడూర్ మండలం గుంత కోడూర్ లో కార్డెన్ అండ్ సెర్చ్

sp ngkrnl

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్.వై.సాయి శేఖర్ తాడూర్  మండలం  గుంత కోడూర్ గ్రామంలో 70  సిబ్బంది తో  కలిసి  కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ రోజు రాత్రి  7:00 నుండి 9:00 గంటల మధ్యలో కోడూర్ గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కువ మంది  వ్యవసాయం  పై  ఆధారపడి  జీవిస్తున్నారని అలాంటి వారు ఏ కారణం వల్ల కూడా ఆత్మహత్యలను చేసుకోవద్దని కోరారు. ఆదాయం పెంచుకోవడానికి సేంద్రీయ వ్యవసాయం,కోళ్ళు, పశుసంరక్షణ  పెంచుకొని ఆధారిత  వ్యవసాయం చెయ్యాలని ఆయన సూచించారు. ఈ విధంగా చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఆయన చెప్పారు. రసాయనిక ఎరువులు భూమిని పాడుచేస్తాయని,  దాని స్టానంలో అక్కడ జీవమృతం వాడితే  భూమి లో సుక్ష్మ క్రిములు అభివృద్ధి  చెంది  భూమి ని సారవంతం చేస్తుందని ఎస్పి తెలిపారు. ఎస్పి సేంద్రీయ  వ్యవసాయం గురించి మాట్లాడినప్పుడు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులతో ఎస్పీ కలుపుగోలుగా మాట్లాడటం తొలి సారి చూస్తున్నామని వారు అన్నారు. గుంత కోడూర్  గ్రామంలోని   ఇండ్లల్లో  ప్రజలు నివాసం ఉంటున్న దాదాపు 107   గృహాలలో  సోదాలు నిర్వహించి  ద్విచక్ర వాహనాలు   చెక్  చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ  ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఇక్కడ గ్రామం లో కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచాలని,  అసాంఘిక శక్తుల నుంచి ప్రజలు అప్రమతంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసులకు 100 డైల్ ద్వారా గాని, ఇతర మార్గాల ద్వారా గాని, సమాచారం  ఇవ్వాలని తెలియజేశారు. అదేవిధంగా గ్రామస్తులు  అందరు  గ్రామ భద్రత నిమిత్తం  తమ  కాలనీ లో” నేను సైతం/కమ్యూనిటీ సిసి కెమెరా ” కార్యక్రమం లో భాగంగా  సిసి కెమెరా లను ఏర్పాటు చేసుకోవాలని  సూచించారు. గ్రామంలో  ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే  నిజాలని బహిర్గతం చేసి , సమస్య పరిష్కారానికి ఉపయోగపడతాయని గుర్తు చేస్తూ గ్రామ  వాసులకు  వివరించారు. అవసరమైతే  స్థానిక నాయకులతో కలిసి  వారి  సహాయంతో జిల్లా లోని  అన్ని  గ్రామాలలో  ఈ    సి సి కెమెరా ల  ఏర్పాటు  చేసుకోవాలని   సూచించారు. ఈ తనిఖీలో ఆర్సీ, లైసెన్స్, ఇన్సురెన్స్ తదితర దృవపత్రాలు లేని వాహనాలు స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్డెన్ సర్చ్ కార్యక్రమంలో నాగర్ కర్నూల్  డి.ఎస్.పి మోహన్ రెడ్డి,   సిఐలు  గాంధీ నాయక్, వెంకట్ రెడ్డి, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సై లు , ఏఎస్సైలు, హెడ్   కానిస్టేబుల్ లు,   కానిస్టేబుల్ లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నెల్లూరు వి యస్ యు లో ప్రపంచ ధరిత్రి దినోత్సవం

Satyam NEWS

మంటలు రేపుతున్న బూతు మాటలు

Satyam NEWS

ఉద్యోగాలపై జగన్ లాజిక్‌ వీడియో వైరల్‌..!!

Satyam NEWS

Leave a Comment