42.2 C
Hyderabad
May 3, 2024 15: 10 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవి

ap-cm-ys-jagan-mohan-reddy

రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు: 1.దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్) చదువుతున్న పిల్లల  తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15వేలు జమ చేయాలని కేబినెట్ నిర్ణయం. జగనన్న అమ్మఒడికి రూ.6.455 కోట్ల నిధులు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఖర్చు  చేయనుంది.

2.ఇతర రాష్ట్రాల్లో  వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు అందించడంలో భాగంగా నవంబర్ 1 నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు రాష్ట్రాల్లో గుర్తించిన 130 ఆస్పత్రుల్లో  వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సూపర్ స్పెషాల్టీ సేవలు అందించాలని మంత్రి వర్గం నిర్ణయం.

3.తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు పెన్షన్, పక్షవాతం, కండరాల క్షీణత, కదల్లేని స్థితిలో మంచాన పడ్డవారికి, బోధకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 3,4,5 దశల్లో ఉన్నవారికి నెలకు రూ.5 వేలు అందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు కోలుకునే వరకు డాక్టర్ నిర్ధేశించిన ప్రకారం రోజువారీ అయితే రోజుకు రూ.225, లేదా నెలవారీ అయితే నెలకు రూ.5 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.

4.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.16వేలు వేతనం పెంపు.

5.రాష్ట్రంలో అత్యధిక శాతం పౌష్ఠికాహార లోపం, రక్తహీనత  ఉన్న పిల్లలకు అదనంగా రూ.128 కోట్లు ఇవ్వాలని మంత్రివర్గ నిర్ణయం. దీనిపై వెచ్చించేది మొత్తం రూ. 305 కోట్లు కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.47 కోట్లుగా ఉంది.

6.కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.

7.షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు. షెడ్యూల్ కులాల్లోని మాల, మాదిగ, రెల్లీ ఇతర ఉప కులాలకు వేరువేరుగా 3 కార్పొరేషన్ లు ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం.

8.హజ్, జెరూసలెం  వెళ్తున్న యాత్రికుల కోసం గతంలో ఇస్తున్న  ఆర్థిక సాయాన్ని పెంచేందుకు మంత్రి వర్గం నిర్ణయం.

9.ఎం.శాండ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు అందించేందుకు మంత్రివర్గం ఆమోదం.

10.వైద్య, విద్య, సాంకేతిక విద్య, సామాజిక సేవ, పరిశ్రమలు, సేవా రంగం, వాణిజ్యం, సాహిత్యం,  కళా రంగాలు, క్రీడలలో ప్రతిభ చూపిన వారికి ప్రతి ఏటా జనవరి 26న 50 మంది, ఆగస్ట్ 15న 50 మంది మొత్తం 100 మంది ప్రతిభావంతులకు  వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో పాటు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.

11.అభ్యంతరాలు లేని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

12.గ్రామ/వార్డు సచివాయాల్లో ఖాళీగా ఉన్న 397 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.

13.కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో రసాయన కర్మాగారం కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన 498 ఎకరాల భూకేటాయింపు రద్దుకు మంత్రివర్గం నిర్ణయం.

14.విశాఖలోని బీచ్ రోడ్డులో కన్వెన్షన్ సెంటర్ కోసం లులూ గ్రూప్‌నకు కేటాయించిన 13.6 ఎకరాల లీజ్ ను రద్దు చేసిన మంత్రివర్గం.

15.ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలకు ఊపిరి అందించేందుకు బ్యాంకుల నుంచి రుణాలు, బాండ్లు జారీ చేసేందుకు అనుమతి.

16.హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.

17.రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన పేమెంట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం.రూ. 10వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు నవంబర్ 7న 3 లక్షల 69వేల 655 మంది బాధితులకు రూ.264 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసేందుకు కేబినెట్ నిర్ణయం.రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు కూడా నష్టపరిహారం అందిస్తామని కేబినెట్ వెల్లడి.

Related posts

టిఆర్ఎస్ ను గెలిపిస్తే కేసీఆర్ అహంకారం ఇంకా పెరుగుతుంది

Satyam NEWS

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS

బాపూజీ కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదు

Satyam NEWS

Leave a Comment