39.2 C
Hyderabad
May 4, 2024 20: 06 PM
Slider సినిమా

మెగాస్టార్ చిరంజీవిది అద్భుత జ్ఞాపకశక్తి

#megastar

దేవుడు కొందరికి అసాధారణ ప్రజ్ఞా పాటవాలు, అసాధారణ మేధాశక్తిని ఇస్తాడు. దీనిని మనం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గమనించగలం. అలాంటి వ్యక్తి ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది. ఒకసారి ఎవరైనా చిరంజీవికి తన పేరు చెబితే బాగా గుర్తు పెట్టుకుంటారు. మళ్లీ ఆ వ్యక్తి ఎప్పుడైనా తారసపడితే అదే పేరుతో పలకరిస్తారు. ఆ వ్యక్తులు ఆయన జ్ఞాపకశక్తిని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అటువంటి సంఘటన ఒకటి నేను చూశాను.

‘ఠాగూర్’ సినిమా చిత్రీకరణ సమయంలో కొంతమంది అంధ యువకులు స్టూడియో లోపలికి వచ్చారు. వారు వరుసగా తమ పేర్లు చెప్పి పరిచయం చేసుకున్నారు. ఆయన అవన్నీ విన్నారు. సినిమా చిత్రీకరణకు పిలుపు రావడంతో సెట్లోకి వెళ్లారు. మళ్లీ తిరిగి వచ్చాక ఒక్కొక్కరి పేర్లు పెట్టి అంధ యువకులను దగ్గరికి పిలిచారు. వారిని పేర్లతో పలకరించి వివరాలు అడుగుతుంటే వాళ్ళు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొందరైతే  షాక్ కు గురి అయ్యారు. వాళ్ళ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి.

ఒకరి వెంట మరొకరు వరుసగా దాదాపు పదిమంది చెప్పిన పేర్లను ఆయన గుర్తు పెట్టుకొని పేరు పేరునా పలకరించి, వారితో మాట్లాడటం ఇందుకు కారణం. అప్పట్లో ‘ఈనాడు సినిమా” డెస్క్ ఇంచార్జ్’ గా ఉన్న నేను ‘ఈనాడు సినిమా” పత్రికలో ఈ  విషయాన్ని రాశాను. దీనికి చాలా మంచి స్పందన కూడా వచ్చింది.

అంతేకాదు సినిమా చిత్రీకరణ సమయంలో కూడా చిరంజీవి డైలాగులు  ఒక్కసారి వింటే  పొల్లు పోకుండా అద్భుతంగా తిరిగి చెప్పగలరని చాలా మంది సినీ ప్రముఖులు నాతో చెప్పారు. అందుకే చిరంజీవికి అంతటి పేరు  ప్రఖ్యాతులు లభించాయి. ఏది ఊరకే రాదు. దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంటుంది. ఇది గమనిస్తే విజయానికి అడ్డదారులు ఉండవని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది.

ఫయాజ్, సీనియర్ జర్నలిస్ట్, నెల్లూరు. 8886833033

Related posts

కైండ్ నెస్: మానవత్వం మూర్తీభవించిన కేసీఆర్

Satyam NEWS

కొల్లాపూర్ పాలిటిక్స్: టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన జగదీశ్వర్ రావు

Satyam NEWS

ఒకేదేశం, ఒకే జెండా మాదీ అదే నినాదం

Satyam NEWS

Leave a Comment