39.2 C
Hyderabad
May 4, 2024 19: 42 PM
Slider ప్రత్యేకం

కన్ఫ్యూజన్: ఆర్డినెన్సు ద్వారా ఏపి బడ్జెట్ ప్రతిపాదన?

jagan 21

ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇప్పట్లో లేనట్లేకనిపిస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో అయితే మార్చి 31 వ తేదీ లోపు బడ్జెట్ ను అసెంబ్లీ, కౌన్సిల్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ద్రవ్యవినిమయ బిల్లును కూడా రెండు సభలూ ఆమోదించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు అసాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఏ విధంగా నిర్వహించాలో అర్ధం కావడం లేదు. ఇప్పటికే ఏపి కౌన్సిల్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. అది పార్లమెంటులో పెండింగ్ లో ఉంది.

ఈ సమయంలో కౌన్సిల్ ను పిలవాలా వద్దా అనే చర్చ నడుస్తున్నదని సత్యం న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. తమ దృష్టిలో కౌన్సిల్ రద్దు అయిపోయినందున కౌన్సిల్ ను పిలవకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు కూడా గతంలోనే సత్యంన్యూస్ వెల్లడించింది.

ఈ మేరకు చట్టంలోని ప్రొవిజన్స్ పై సంబంధిత అధికారులు చర్చలు కూడా జరిపారు. కౌన్సిల్ రద్దు పూర్తి కాకుండా ఒక్క అసెంబ్లీనే బడ్జెట్ సమావేశాలకు పిలవడం ఎంత వరకు సబబో అర్ధం కాక అధికారులు తలపట్టుకుని కూర్చున్నారు. ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, అవి వాయిదా పడటం, కరోనా విజృంభించడం తదితర కారణాలు చుట్టుముట్టాయి.

25వ తేదీ వచ్చినా అసెంబ్లీ ఎప్పుడు పెట్టాలి అనే విషయాన్ని ఎవరూ నిర్ణయించుకోలేకపోతున్నారు. పైగా ఇప్పుడు కౌన్సిల్ ను పిలవాల్సి వస్తే కౌన్సిల్ లో కచ్చితంగా ద్రవ్య వినిమయ బిల్లు ఆగిపోతుందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల జోలికి వెళ్లకుండా గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ఒకటి, రెండు నెలలకు కావాల్సిన బడ్జెట్ ను ఆమోదం తీసుకునే యోచన చేస్తున్నారు.

దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నందున ఇలా చేయడం బెటరని అధికారులు అంటున్నారు. అప్పుడు కౌన్సిల్ లో బిల్లు పాస్ కావాలనే సమస్య కూడా తప్పుతుందని అంటున్నారు. అందుకే ఆఖరు నిమిషం వరకూ వేచి ఉండి అప్పుడు ఆర్డినెన్సు తీసుకువస్తారని అంటున్నారు.

Related posts

రామోజీరావు కుంభకోణంపై సుప్రీం విచారణ

Satyam NEWS

విద్యాశాఖలో అవినీతి, అక్రమాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు

Satyam NEWS

హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి

Satyam NEWS

Leave a Comment