26.7 C
Hyderabad
May 3, 2024 09: 24 AM
Slider నల్గొండ

హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి

#CITUHujurnagar

కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని హైకోర్టు ఆగస్టు 11న  ఇచ్చిన తీర్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్మికులతో రోషపతి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ముందు హైకోర్టు తీర్పుని అమలు చేయాలని నిరసన తెలపాలని కోరారు.

అలానే కరోనా టెస్టులను ప్రజలందరికీ చేయాలని, ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ముత్తమ్మ, దుర్గారావు, రవి, సైదులు, గోపి, చంద్రకళ, కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హన్మకొండలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Satyam NEWS

టికెట్ కేటాయింపులో షబ్బీర్ అలీ హోదా ఏంటి..?

Satyam NEWS

మళ్లీ రాజకీయాలలోకి వస్తున్న మెగాస్టార్

Satyam NEWS

Leave a Comment