27.7 C
Hyderabad
May 16, 2024 07: 07 AM
Slider విజయనగరం

శ్రీశ్రీ శ్రీ పైడితల్లి పండుగ లో ట్రాఫిక్ నిర్వహణ సమర్ధవంతం…!

#vijayanagarampolice

ట్రాఫిక్ సిబ్బందికి ప్రశంసా పత్రాలతో బహుకరణ…!

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ మహిళలపై జరిగే దాడుల్లో నమోదైన కేసుల్లో నిందితులు కఠినంగా శిక్షింపబడాలన్నారు. ఇందుకుగాను ఆయా కేసుల్లో దర్యాప్తును క్షుణ్ణంగా చేయాలని, సాక్ష్యాలను, సాంకేతిక ఆధారాలను సేకరించాలని, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మహిళలపై జరిగే నేరాలను ప్రాధాన్యత కేసుల జాబితాలో చేర్చి, ప్రాసిక్యూషను త్వరితగతిన పూర్తయి, నిందితులు కఠినంగా శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదైన కేసుల దర్యాప్తు ప్రగతిని సి.సి.టి.ఎన్.ఎస్. (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్) పోర్టల్ ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. చైన్ స్నాచింగ్ మరియు చోరీలు జరగకుండా చర్యలు చేపట్టాలని, రాత్రి పెట్రోలింగు, గస్తీని ముమ్మరం చేయాలని, ఎ.టి.ఎం. కేంద్రాలను తరుచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.

చైన్ స్నాచింగ్స్ జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టాలని, చోరీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, రహదారి భద్రతపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. డిసెంబరు 9న నిర్వహించే లోక్ అదాలత్ లో ఎక్కువ ఐపిసి కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, అధికారులను ఆదేశించారు.

వివిధ కోర్టుల నుండి జారీ అయ్యే నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్రత్యేక టీమ్స్న ఏర్పాటు చేయాలన్నారు. 10 లీటర్ల ఐ.ఎం.ఎఫ్.ఎల్. కన్నా తక్కువగా పట్టుబడిన ఎక్సైజ్ కేసుల్లో నిందితులతో చలానాలు కట్టించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తు లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, ఆయా కేసుల్లో దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత దర్యాప్తు అధికారులకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక దిశా నిర్దేశం చేసారు.

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో నమోదై, చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంటును ఎగ్జిక్యూట్ చేసిన వన్ టౌన్ ఎస్ఐ ఆర్. గోపాలరావు, జాతీయ లోక్ అదాలతో ఎక్కువ కేసులను డిస్పోజ్ అయ్యే విధంగా సమర్థవంతంగా పనిచేసిన వన్ టౌన్ పీఎస్ కానిస్టేబుల్ బి.మోహనరావు, విజయనగరం రూరల్ పోలీసు స్టేషను చోరీ కేసును చేధించుటలో సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం రూరల్ ఎస్ఐ బి. గణేస్, కానిస్టేబుళ్ళు బి.గౌరీ శంకర్, బి. రామకృష్ణ, కె. రామమోహన్, ఆసుపత్రుల నుండి పెండింగులో ఉన్న సర్టిఫికెట్స్ను సకాలంలో తీసుకొని వచ్చుటలో సమర్థవంతంగా పని చేసిన డెంకాడ కానిస్టేబులు జి. రామరాజు,

పోక్సో కేసుల్లో నిందుతులకు శిక్ష పడే విధంగా సాక్షులను కోర్టులో హాజరుపర్చిన బొబ్బిలి హెడ్ కానిస్టేబుల్ సి. హెచ్. స్వామి నాయుడు, దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేయుటలో సమర్థవంతంగా పనిచేసిన రామభద్రపురం హెచ్సి వి.ఎల్.వి.నారాయణ, దిశా యాప్ను ఎక్కువ డౌన్లోడింగు మరియు రిజిస్ట్రేషను చేయించి, అవగాహన కార్యక్రమాలు చేపట్టిన బాడంగి మహిళా కానిస్టేబుల్ బి. తులసి, శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ పండగ సందర్భంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించిన విజయనగరం ట్రాఫిక్ ఎస్.ఐలు వి. లోవరాజు, కె.వి.వి.ప్రసాద్, హెచ్సి ఎ.వి. రమణ, కానిస్టేబుళ్ళు ఎస్.సింహాచలం, వై.అప్పారావు, వై. శంకరరావు,

ఎటిఎం దొంగతనం కేసులో నిందుతుడిని పెట్టుకొనుటలో సమర్థవంతంగా పని చేసిన సిసిఎన్ ఎస్.ఐ బి. సాగర్బాబు, ఏఆర్ కానిస్టేబుల్ పి. కాళిదాసు, ఎన్పోర్సెమెంటు కేసుల్లో ముందస్తు సమాచారం సేకరించుటలో సమర్థవంతంగా పనిచేసిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ షేక్ బి. జానీ అదే విధంగా ఏఆర్ లో పిఎసి ఒ భాగంలో పని చేస్తూ, ఇటీవల నిర్వహించిన ఫైరింగ్ టెస్టులలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన హెచి వి.శ్రీనివాసరావు, కె.వి. రమణ, డి. రాము, బి. శంకర్, బి. ఎ. రాజుల ను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేసారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్దీన్, సెబ్ అదనపు ఎస్పీ ఎస్. వెంకటరావు, విజయ నగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీధర్, చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, న్యాయ సలహాదారులు వై. పరశురాం, డిసిఆర్బి సిఐ జె. మురళి, ఎస్బీ సిఐలు కే.కే. వి. విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి, వన్ టౌన్ సిఐ బి. వెంకటరావు,టూటౌన్  సిఐ విజయ ఆనంద్, ఎస్.కోట సిఐ బాలసూర్యారావు,

కొత్తవలస సిఐ చంద్రశేఖర్, రాజాం సీఐ రవికుమార్, రాజాం రూరల్ సీఐ ఎస్. శ్రీనివాస్, చీపురుపల్లి సీఐ హెచ్.ఉపేంద్ర, గజపతినగరం సీఐ ఎల్.అప్పల నాయుడు, సీసీఎస్ ఎం. బుచ్చిరాజు, బొబ్బిలి సీఐ నాగేశ్వరావు, బొబ్బిలి రూరల్ సీఐ ఎస్. తిరుమల రావు, భోగాపురం సీఐ వెంకటేశ్వరరావు, కంట్రోల్ రూం సీఐ రాజశేఖర్, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరోనా హెల్ప్: సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆధ్వర్యంలో పండ్లు, గుడ్లు

Satyam NEWS

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ఓగాడ్: నిర్మ‌ల్ జిల్లాలో వలసకూలీలకు రోడ్డు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment