28.7 C
Hyderabad
April 28, 2024 08: 34 AM
Slider హైదరాబాద్

కరోనా హెల్ప్: సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆధ్వర్యంలో పండ్లు, గుడ్లు

Salvation Army

కరోనా నియంత్రణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్న  పోలీసులు, పారిశుధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సిటీ లైట్ హోటల్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ట్రాపిక్ పోలీసులు, GHMC పారిశుధ్య సిబ్బందికి పద్మారావు నగర్ లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆధ్వర్యంలో పండ్లు, గుడ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండుటెండల ను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వారికి స్వచ్చంద సంస్థలు, దాతలు చేయూతను అందించాలని అన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు 150 ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు సాల్వేషన్ ఆర్మీ చర్చి కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, పద్మారావు నగర్ TRS ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, చర్చి కమిటీ సభ్యులు సూర్య ప్రకాష్, సాల్మన్ రాజ్, ప్రభు దాస్, మహంకాళి ACP వినోద్ కుమార్, CI శ్రీనివాస్, మార్కెట్ ఇన్ స్పెక్టర్ శంకర్ యాదవ్, ట్రాపిక్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వర్ రావు, మెడికల్ ఆఫీసర్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇప్పటికి బుద్ధి మార్చుకోలేని తెలంగాణ వృద్ధ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

సీతారాంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం

Satyam NEWS

గీత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో 5 వేల కోట్లు కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment