కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌పై తిరువనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 30 సంవత్సరాల క్రితం ఆయన రచించిన పుస్తకానికి సంబంధించిన విచారణకు హాజరుకాకపోవడంతో తిరువనంతపురం కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది.
థరూర్ పుస్తకం ‘ది గ్రేట్ ఇండియన్ నవల’ లోని ఒక విభాగం ‘నాయర్’ మహిళలకు పరువు నష్టం కలిగించేదని ఫిర్యాదుదారు ఆరోపించారు. న్యాయస్థానం సమన్లలో ఆయన హాజరు కావాల్సిన సమయం మాత్రమే ప్రస్తావించారని, అందులో తేదీ చెప్పలేదని అందువల్ల థరూర్ హాజరు కాలేకపోయారని ఆయన కార్యాలయ సహాయకులు చెప్పారు. అరెస్టు వారెంట్‌కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేస్తామని వారన్నారు.