ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖనే పూర్తిస్థాయి రాజధాని కాబోతుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే అమరావతి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటవుతుందని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.
నిపుణుల కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై పలువురి నేతలు చేసే కామెంట్లు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. సీఎం జగన్ 3 రాజధానులుంటాయని తెలిపారు.దీనికి ఆయా పార్టీల్లో మద్దతు కూడా లభించింది. ఇంకోవైపు అమరావతిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈ పరిణామాలతో ఏపీ ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఇక రాజధాని రైతులైతే రోడ్లెక్కి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు.