33.7 C
Hyderabad
April 27, 2024 23: 56 PM
Slider కరీంనగర్

మనీ మేడ్:కోట్లు గుమ్మరించి జిమ్మిక్కులు చేసి గెలిచారు

bandi-sanjay-kumar

కోట్లు గుమ్మరించి జిమ్మిక్కులు చేసి తెరాస కార్పొరేషన్లో అధికారం కైవసం చేసుకుందని ఎంపీ బండి సంజయ్ అన్నారు.సోమవారం సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 13 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2 డివిజన్ల నుంచి 13 డివిజన్లకు మా బలం పెంచుకోవడంతో పాటు, బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకున్నామని వ్యాఖ్యానించారు.

కోట్లు గుమ్మరించి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని, మేము కాంగ్రెస్ తో గెలిచామనడం హాస్యాస్పదమని, ఎంఐఎంతో కలిసింది మీరని, స్మార్ట్ సిటీ, అమృత్ నిధులు కేంద్రానివే అని అన్నారు. ఒక్క బండి సంజయ్ ను ఎదుర్కొనేందుకు ఏడుగురు ఎమ్మెల్యేలు డబ్బు సంచులు కుమ్మరించారు. భైంసా అల్లర్లను గల్లీ గొడవ అని సీఎం అంటున్నారని, తాము 13 గెలిచినా సంతోషంగా ఉందని, వాళ్లు 33 గెలిచినా ఆనందంగా లేరని, రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పోరేషన్ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.

అవినీతికి ఆస్కారం లేకుండా నాణ్యంగా స్మార్ట్ సిటీ పనులు జరిగేలా, బీజేపీ డేగ కన్నుతో కాపలాగా ఉంటుందఐ, భైంసా అల్లర్లలో చనిపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోలేదని, గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఒక నెల గౌరవ వేతనాన్ని బైంసా బాధితులకు అందిస్తామని, అవసరమైతే జోలె పట్టి వాళ్ళను ఆదుకుంటామని, కేటీఆర్ ఇలాకాలో 13 మంది ఇండిపెండెంట్లు గెలిచారని, మేము తప్పుడు ఆరోపణలు చేయమని, కేసీఆర్ రూ.10 లక్షలతో సీఏఏకు వ్యతిరేకంగా సభ నిర్వహిస్తే, మేము 20 లక్షలతో సభ పెడతాం అన్నారు.

ఇక్కడ బాంబులు పేల్చే వాళ్ళకి పౌరసత్వం ఇమ్మంటారా? మీకు భయపడేది లేదు. ఎన్నార్సీ తెస్తాం అన్నారు. మీరు సమగ్ర సర్వే చేస్తే తప్పులేదు కానీ, మేము ఎన్.పి.ఆర్ తెస్తే తప్పా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీల దమ్మేందో చూపిస్తామన్నారు. టీఆర్ఎస్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి బండారం బయటపెడతామని, అనారోగ్యం పేరుతో రెండు రోజులు ఆస్పత్రిలో చేరి కొడుకును సీఎం చేయాలని డ్రామా ఆడారని, పార్టీ చీలిపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతో నేను బాగానే ఉన్నానంటూ మళ్లీ మీడియా ముందుకు వచ్చారని అన్నారు.

Related posts

17న తిరుమలలో కార్తీక వన భోజన మహోత్సవం

Satyam NEWS

సేక్రెడ్ గాడ్: వన దేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

Satyam NEWS

రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment