హరిహర సుతుడు అయ్యప్ప కొలువై ఉన్న శబరిమల భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నది. అయ్యప్ప భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. భక్తులతో శబరిగిరి ఇప్పటికే నిండిపోయింది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు.
స్వామివారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి 4 గంటలకు పైగా సమయం పడుతుండగా, రిజర్వేషన్ లేని సాధారణ భక్తులు స్వామి దర్శనం కోసం దాదాపు 8 గంటలు వేచి చూడాల్సి వస్తోంది. పంపానదిలో నీరు అడుగంటి పోతుండడంతో భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఇబ్బంది పడుతున్నారు.