33.2 C
Hyderabad
May 15, 2024 21: 57 PM
Slider ప్రపంచం

ఉక్రెయిన్‌ ఎదురు దాడి: 50 మంది రష్యన్ సైనికులు మృతి

రష్యా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో 50 మంది రష్యన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. 3 యుద్ధ ట్యాంకులు, మాస్టా-ఎస్‌ యుద్ధ ట్యాంకులు, 11 సాయుధ వాహనాలను ఉక్రెయిన్‌ దళాలు ధ్వంసం చేశారు. ఫ్రంట్‌లైన్‌లో గురువారం ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్‌ ఆపరేషనల్‌ కమాండర్‌ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇప్పటివరకూ.. 2 లక్షల మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. రెండు దేశాలూ చెరో లక్షమంది వరకు నికులను కోల్పోయినట్లు అమెరికా అంచనా వేస్తోంది. ఉక్రెయిన్‌లో మరో 40 వేల మంది పౌరులు మృత్యువాత పడి ఉంటారని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌కు మరో 40 కోట్ల డాలర్ల (దాదాపు రూ.3,280 కోట్లు) విలువైన సైనిక సాయాన్ని అందించాలని అమెరికా నిర్ణయించింది. కొత్తగా 40 కోట్ల డాలర్ల భద్రతా సహాయ ప్యాకేజీలో భాగంగా అమెరికా ఉక్రెయిన్‌కు వాయు రక్షణ వ్యవస్థలు, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను అందజేస్తుందని పెంటగాన్ ప్రకటించింది.

Related posts

బురద రాజకీయాల్లో కూరుకుపోతున్న విలువలు

Satyam NEWS

బాలకృష్ణ ఇంటి వద్ద భారీగా పోలీస్ ల మొహరింపు

Satyam NEWS

ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ కి చక్రధర్ సిద్దాంతి

Satyam NEWS

Leave a Comment