23.2 C
Hyderabad
May 7, 2024 21: 03 PM
Slider విజయనగరం

విద్యా శాఖ మంత్రి బొత్స కు కాలేజీ విధ్యార్ధుల మొర…

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కి విద్యార్థుల ధర్నా సెగ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంతో పాటు విజయనగరం జిల్లా లో మూడేళ్ళ క్రితం హామీ ఇచ్చిన కొత్త కళాశాల ఏర్పాటు సంగతేంటని మంత్రి బొత్స ను అడిగారు.. విద్యార్థి సంఘాలు. విజయనగరం జిల్లా లో కాలేజీ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని.. అలాగే విజయనగరం, గజపతినగరం లలో గతంలో హామీ ఇచ్చిన కాలేజీ ల ఏర్పాటు అలాగే కళాశాల లో లెక్చరర్లు ,సదుపాయాలు కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట

ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది విద్యార్ధినీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ నేత సాగర్ మాట్లాడుతూ… జిల్లా లో ఇంటర్ విద్యార్థులు సమస్యలను పరిష్కరించడంలో విద్యా శాఖ మంత్రి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేసారు. జగన్ ప్రభుత్వం పాలన కొనసాగించి..నాల్గో ఏడు వచ్చేసినా… ఇంటర్ విధ్యార్ధుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. తక్షణమే సమస్యలు మరింత జటిలం కాకుండా పరిష్కరించాలని కళాశాల విద్యార్థులు… ఆందోళన చేపట్టారు. అనంతరం మంత్రి బొత్స ను ఎస్.ఎఫ్.ఐ నేతలు కలిసి… తమ మొర వినిపించారు.

Related posts

SLTA క్యాలెండర్ ఆవిష్కరించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కేశ్ బి లాఠ్కర్

Satyam NEWS

రెండు రాష్ట్రాల అసెంబ్లీకి మోగిన నగారా

Satyam NEWS

పేదవారికి నిత్యావసరాలు పంచిన మార్కండేయ సేవా సమితి

Satyam NEWS

Leave a Comment